లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ రోల్ లో సోనూ సూద్

Sonu Sood to Portray Pullela Gopichand in PV Sindhu Biopic,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Sonusood Plays as Pullela Gopichand in PV Sindhu Biopic,Bollywood Actor Sonu Sood Upcoming Movies Updates,PV Sindhu Biopic Latest Updates,PV Sindhu Biopic News,Sonu Sood Act as Pullela Gopichand on PV Sindhu Biopic,Sonu Sood to Make a Biopic on PV Sindhu
Sonu Sood to Portray Pullela Gopichand in PV Sindhu Biopic

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఏ ఇండస్ట్రీలో చూసినా ఏదో ఒక బయోపిక్ తెరకెక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో ఇండియన్ బ్యాడ్మింటన్ పీవీ సింధు బయోపిక్ తెరకెక్కునున్న సంగతి తెలిసిందే కదా. సోనూ సూద్ ఈ బయోపిక్ నిర్మిస్తుండగా.. ఇప్పటివరకూ పీవీ సింధూ రోల్ లో నటించేది ఎవరో? డైరెక్టర్ ఎవరో ప్రకటించలేదు.

అయితే ఈ సినిమాలో తాను కూడా ఓ కీ రోల్ లో నటిస్తున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూ సూద్ తెలిపారు. ఈ బయోపిక్ లో తాను లెజెండరీ బ్యాడ్మింటన్.. పీవీ సింధూకు కోచ్ గా ఉన్న పుల్లెల గోపించద్ రోల్ లో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి పీవీ సింధూ ఎన్నో పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. మరి ఆ పథకాలు సాధించడంలో పుల్లెల గోపిచంద్ ముఖ్య భూమిక పోషించారన్న సంగతి కూాడా విదితమే.

కాగా ఇక్కడ టాలీవుడ్ లో పుల్లెల గోపిచంద్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు పుల్లెల గోపిచంద్ పాత్రలో నటిస్తున్నాడు. పుల్లెల గోపిచంద్, సుధీర్ బాబు ఇద్దరూ మంచి స్నేహితులు.. సుధీర్ కూడా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఈ సినిమాను చేస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here