నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా – బాలకృష్ణ పెద్ద కమెడియన్

Naga Babu Sarcastic Comments on Balakrishna,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Actor Naga Babu About Balakrishna,Naga Babu Sensational Comments on Balakrishna,#NagaBabu,Naga Babu Comments on Nandamuri Balakrishna,Balakrishna is a Great Comedian Says Naga Babu
Naga Babu Sarcastic Comments on Balakrishna

బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలీదు? ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు ఇది. మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇంటర్వ్యూలో బాలయ్య గురించి చెప్పమనగా..ఆయన గురించి నాకు తెలియదు అని విచిత్రంగా స్పందించారు. అయితే ఒక్కక్షణం ఆగి ఏయ్.. బాలయ్య గురించి తెలియదు అన్నానేంటి? బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్… నేరము శిక్షలో కృష్ణగారు, ఆయన కలిసి యాక్ట్ చేశారు” అని సినీయర్ నటుడు బాలయ్య గురించి చెప్పుకొచ్చారు నాగబాబు.

మేము అడిగింది ఆ బాలయ్య గురించి కాదండీ.. నందమూరి బాలకృష్ణ గురించి అని యాంకర్ అడగ్గానే… నాగబాబు రియాక్ట్ అవుతూ ‘నేనెప్పుడూ ఆయన పేరు వినలేదు. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అంటూ స్కిప్ చేశారు. బాలయ్య పేరు వినలేదని చెప్పడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఆర్టిస్టులగా మీరు అందరూ ఒకే కుటుంబం. కానీ పొలిటికల్ రైవలరీలో అలా మాట్లాడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగానే… ‘నాకు ఎవరూ తెలియదండీ బాబూ’ అంటూ మళ్లీ అదే జవాబు ఇచ్చారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పుడు తన వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. నిన్న ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు అంటే ఎవరో తెలియదు అనేశాను.. అయితే దానివల్ల కొంత మంది ఫీలయ్యారని ఫీడ్ బ్యాక్ వచ్చింది.. నిజంగా బాలకృష్ణ గారు ఎవరో తెలియదు అనడం నిజంగా నా మిస్టేకే.. బాలకృష్ణ గారు తెలియని వారు ఎవరుంటారు.. ఆయన అందరికీ తెలుసన్నారు. అంతేకాదు ఆయన మంచి నటుడు..ముఖ్యంగా ఆయన పెద్ద కమెడియన్.. ఆయనలా కామెడీ చేసేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు..గొప్పగా నవ్విస్తారు..అలాంటి హాస్యనటుడు బాలకృష్ణ గారిని నేను మర్చిపోయాననడం నిజంగా నా మిస్టేకే అన్నారు. పైగా ఆయన ఎన్టీఆర్ తో కూడా వర్క్ చేశారు.. వల్లూరి బాలకృష్ణ గారు.. ఈయన కృష్ణ గారి అసాధ్యులు సినిమాలో కూడా మంచి కామెడీని పండించారు.. అలాంటి వారిని మర్చిపోయాననడం నిజంగా నా పొరపాటే అని చెప్పారు. వల్లూరి బాలకృష్ణ అని వికీపీడియాలో కొడితే వస్తుంది అని చెప్పి ఓ వీడియో ద్వారా చెప్పారు. మరి నాగబాబు గారు సారీ చెబుతూనే మళ్లీ కామెంట్స్ చేస్తున్నవారికి రివర్స్ కౌంటర్ ఇచ్చినట్టున్నారు కదా!

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here