మహేష్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించిన నాగబాబు

Naga Babu praises Mahesh Babu,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Naga Babu About Superstar Mahesh Babu,Naga Babu Sensational Comments on Superstar Mahesh Babu,Naga Babu Latest Updates,Naga Babu Appreciate Superstar Mahesh Babu,Naga Babu Speaks Highly of Superstar Mahesh
Naga Babu praises Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబుపై మెగా బ్రదర్ నాగబాబు ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు మహేష్ గురించి అడిగిన వెంటనే ఎక్కడా తడుముకోకుండా మహేష్ పై పొగడ్తలు కురిపించారు. మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పండని యాంకర్ అడిగిన వెంటనే…నాగబాబు స్పందిస్తూ ఆయన గురించి చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆయన గురించి ఒక్క మాట కాదు పది మాటలైనా చెప్పొచ్చు. ఈ రోజు మోస్ట్ హ్యాండ్సప్ హీరో, కళ్యాణ్ బాబు తో పాటు ఈక్వల్ పాపులారిటీ ఉన్న హీరో అని చెబుతూ.. బిజినెస్ లు ఉన్నాయి..ఈ మధ్య థియేటర్ కూడా కట్టాడు అని అన్నారు.

అంతేకాదు.. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్లు.. మహేష్ బాబును ఒక తమ్ముడు లాగా, ఒక కొడుకులాగ …యంగ్ గా ఉండే అమ్మాయిలకు ఓ రొమాంటిక్ హీరోగా ఫీలవుతుంటారు..ఆయనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి కొందరు డిప్రెషన్లో ఉండి ఉంటారు అని చమత్కరించారు. ప్రిన్స్ అనే మాటకు మహేష్ బాబు కరెక్ట్ గా సూటవుతాడు అంటూ నాగబాబు ప్రశంసలు గుప్పించారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో బాలకృష్ణ గురించి అడుగగా.. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని చెప్పి షాకిచ్చారు నాగబాబు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి కూడా తెలిసిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here