మ‌రోసారి గొంతు స‌వ‌రించుకున్న త‌మ‌న్నా

Tamannaah Own Dubbing for Next Enti Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Actress Tamannaah Latest UPdates,Tamannaah Dubbing for Next Enti Movie,Next Enti Movie Latest News,Tamannaah Own Dubbing Movies,Tamannaah Own Dub for Next Enti Movie,Tamannaah Dub For Their Own Voice in Next Enti Movie
Tamannaah Own Dubbing for Next Enti Movie

త‌మ‌ పాత్ర‌కు త‌మే డ‌బ్బింగ్ చెప్పుకుంటే… ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం జ‌రుగుతుంద‌ని ఈ త‌రం క‌థానాయిక‌లు న‌మ్ముతున్నారు. అంతే కాదు ప్రేక్ష‌కుల‌కు కూడా ఇట్టే ద‌గ్గ‌ర‌వ్వొచ్చు అనే ఉద్దేశంతో… చాలా మంది క‌థానాయిక‌లు డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి అమితాస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి హీరోయిన్ల‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఒకరు. ఇప్ప‌టికే ‘ఊపిరి’ సినిమాలో త‌న పాత్ర‌కి తొలిసారిగా డ‌బ్బింగ్ చెప్పుకున్న ఈ ఉత్త‌రాది భామ… ఈ ఏడాది ప్ర‌ధ‌మార్ధంలో విడుద‌లైన‌ ‘నా నువ్వే’లో కూడా త‌న గొంతుని స‌వ‌రించుకుంది.

అంతేకాదు… బాలీవుడ్ డైరెక్ట‌ర్ కునాల్ కోహ్లి తొలిసారిగా తెలుగులో తెర‌కెక్కించిన ‘నెక్స్ట్‌ ఏంటి?’ కోసం కూడా త‌మ్ము మ‌రోసారి త‌న గొంతుని వినిపించ‌నుంది. త‌మ‌న్నా, సందీప్ కిష‌న్ జంట‌గా న‌టించిన ఈ సినిమా రేపు (07.12.2018) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 2004లో హిందీలో వ‌చ్చిన ‘హ‌మ్‌తుమ్’ సినిమా ఆధారంగా రూపొందించిన ఈ మూవీలో న‌వ‌దీప్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. లండ‌న్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో త‌మ‌న్నా పాత్ర కొత్త‌గా ఉండ‌డంతో పాటు… ప్ర‌చార చిత్రాలు కూడా ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ అయ్యింది. మ‌రి వీటితో పాటు త‌మ‌న్నా డ‌బ్బింగ్ కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అవుతుందో లేదో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here