ఇప్పటివరకూ టాప్ డైరెక్టర్స్..టాప్ కమెడియన్స్.. టాప్ మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు టాలీవుడ్ బెస్ట్ ఫీమేల్ సింగర్స్ గురించి మాట్లాడుకుందాం. అవకాశాలు పెరుగుతున్న కొద్దీ…సినీ పరిశ్రమలో సింగర్స్ కూడా పెరుగుతున్నారు. రోజుకో సింగర్ పేరు తెరపైకి వస్తుంది. ఒకప్పుడు సింగర్స్ అంటే సుశీల, జానకి, చిత్ర ఇలా కొన్ని నోటెడ్ పేర్లు మాత్రమే వినపడేవి..కానీ ఇప్పుడు సినిమాల్లో ఒక్కో పాటను ఒక్కో సింగర్ చేత పాడిస్తున్నారు. అంతేకాదు… ఒకప్పుడు ఒక్కొక్కరి ఖాతాలో వందల.. వేల పాటలు ఉండేవి. కానీ అప్పటికీ..ఇప్పటికీ రోజులు ఎంతో మారడం…మ్యూజిక్ కూడా మారడంతో ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే రోజుకో గొంతు వినిపిస్తుంది మనకి.
మరి ఈ ఏడాది ఇక ముగింపుదశకు వచ్చేసింది. ఎన్నో మధురమైన పాటలు విన్నాం. ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మన భాషలో చెప్పాలంటే.. టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మధురమైన పాటలు పాడిన కొంత మంది టాప్ ఫీమేల్ సింగర్స్ లిస్ట్ కింద ఇచ్చాం.
రంగమ్మ మంగమ్మ – ఎమ్.ఎమ్ మానసి
ఏంటీ ఏంటీ – చిన్మయి
మందార – శ్రేయ ఘోషల్
అరెరే ఇది కలలా ఉన్నదే – ఆండ్రియా
సదా నన్ను – చారలత మణి
స్వాగతం కృష్ణ – నిరంజన రమణన్
మరి పైన తెలిపిన ఫీమేల్ సింగర్స్ లో 2018 ది బెస్ట్ ఫీమేల్ సింగర్ ఎవరనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.