హ్యాట్రిక్ పై క‌న్నేసిన విజ‌య్, రెహమాన్

Hero Vijay and Music Director AR Rahman to Hit a Record, Hero Vijay Movies Latest News, Hero Vijay Next Movie Updates, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Vijay and AR Rahman to Hit a Record, Vijay and AR Rahman to Hit Hat Trick with 2019 Diwali
Vijay and AR Rahman to Hit Hat Trick with 2019 Diwali

గ‌త ఏడాది దీపావ‌ళికి విడుద‌లైన‌ ‘మెర్స‌ల్’ (‘అదిరింది’)తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు త‌మిళ నటుడు విజ‌య్‌. ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌లైన ‘స‌ర్కార్’తో మ‌రోసారి బాక్సాఫీస్ ద‌గ్గర త‌న స‌త్తాను చాటారు. ఇప్పుడు వరుస‌గా మూడోసారి దీపావ‌ళి సెంట్‌మెంట్‌ను రిపీట్ చేయాల‌నుకుంటున్నారు ఈ ఇల‌య‌ద‌ళ‌ప‌తి. ప్ర‌స్తుతం విజ‌య్ త‌న‌ త‌దుప‌రి చిత్రాన్ని ‘తెరి’ (‘పోలీస్‌’), ‘మెర్సల్’ (‘అదిరింది’) లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌ను అందించిన అట్లీ కుమార్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న‌ ఈ చిత్రాన్ని.. వ‌చ్చే ఏడాది దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నారు.

ఇప్ప‌టికే వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘ఉదయ’, ‘అళగియ తమిళ మగన్’, ‘మెర్సల్’, ‘సర్కార్’ చిత్రాల్లోని పాట‌లు శ్రోత‌ల‌ను ఉర్రూత‌లూగించాయి. వీటిలో దీపావ‌ళి సంద‌ర్భంగా రెండు వ‌రుస సంవ‌త్స‌రాల్లో విడుద‌లైన ‘మెర్స‌ల్ (2017), ‘స‌ర్కార్ (2018)చిత్రాలు వీరి కాంబినేష‌న్‌లేనే అతి పెద్ద విజ‌యాలు. మ‌రి మ్యూజిక‌ల్‌గా అప‌జ‌య‌మే ఎరుగ‌ని ఈ కాంబినేష‌న్‌… వ‌చ్చే దీపావ‌ళికి హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేస్తుందేమో చూడాలి. కాగా… ఈ చిత్రంలో విజ‌య్ కి జోడీగా న‌య‌న‌తార న‌టిస్తోంది. దాదాపు ప‌దేళ్ళ త‌రువాత విజ‌య్, న‌య‌న్ కాంబోలో వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here