అంతరిక్షం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Varun Tej Antariksham Trailer Release Date Locked,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Antariksham Trailer Release Date Fixed,Antariksham Trailer Release Date Confirmed,Antariksham Trailer Release Date Revealed,Antariksham Trailer Release Date Announced,Antariksham Trailer Gets a Release Date
Varun Tej Antariksham Trailer Release Date Locked

ఘాజీ లాంటి సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి ఇప్పుడు వరుణ్ తేజ్ తో అంతరిక్షం అనే వైవిధ్యమైన కథనంతో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు అదితి రావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నఈసినిమాలో సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్‌ విహారి సంగీతం అందిస్తుండగా… క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న చిత్ర కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. మరి ఫిదా, తొలిప్రేమ సినిమాల సక్సెస్ తరువాత వరుణ్ తేజ్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఏం చేస్తుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here