2.0-చైనాలో భారీ రిలీజ్ ప్లాన్

Rajinikanth 2.0 Planned for Humongous Release in China,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,2.0 Planned for Humongous Release in China,2.0 Movie Planned for Humongous Release in China,Rajinikanth 2.0 to Release in China,2.0 Movie to Release in China
Rajinikanth 2.0 Planned for Humongous Release in China

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో..తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రోబో సీక్వెల్ గా తెరకెక్కిన 2.0 సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 29న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఆరురోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు 450 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టుకుంది ఈ సినిమా. విజువల్ వండర్ గా తీర్చిదిద్దిన ఈ సినిమాకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించాడని శంకర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా కొన్ని దేశాల్లో ఇంకా విడుదల కానీ ఈ విజువల్ వండర్ ను భారీగా రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహకాలు చేస్తోంది. ముఖ్యంగా చైనాలో…ఇటీవల భారతీయ సినిమాలకు చైనాలో బాగానే ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే.. చైనా ప్రేక్షకులకు సినిమాను అందించాలని..అక్కడ సినిమా రిలీజ్ ను భారీగానే ప్లాన్ చేశారు. చైనాకి చెందిన హెచ్ వై మీడియా డిస్ట్రిబ్యూష‌న్ ఈ హక్కులను సాధించుకుంది. ఈ నేపథ్యంలో ‘2.0’ చిత్రాన్ని చైనా భాషలో డబ్‌ చేసి రిలీజ్‌ చేయనుంది. ఇక ఇప్పుడు చైనాలో రజిని సినిమాను 10,000 థియేటర్స్‌ లో రిలీజ్ చేయనున్నారు. అంటే ఈ ప‌ది వేల థియేట‌ర్ల‌లో మొత్తం దాదాపు 56,000 స్క్రీన్స్‌ లు ఉండగా.. అందులో ఏకంగా 46 వేలు త్రి డి స్క్రీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 2019 మేలో 2.0 అక్కడ గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు సమాచారం. మొత్తానికి శంకర్ పెద్ద ప్లానే వేశాడు. మరి అక్కడ ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here