ఆ విష‌యంలో కాజ‌ల్ హ్యాట్రిక్‌

Kajal Aggarwal Marks a Rare Feat in Tollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Actress Kajal Aggarwal Latest Movies Details,Kajal Aggarwal Upcoming Movies in Tollywod,Kajal Next Movies Latest News,Kajal New Movie Details,Kajal Aggarwal Rare Feat in Tollywood
Kajal Aggarwal Marks a Rare Feat in Tollywood

‘ల‌క్ష్మీ క‌ళ్యాణం’తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. రెండో చిత్రం ‘చంద‌మామ’తో ఘ‌న‌విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే గాకుండా.. టాలీవుడ్‌లో చంద‌మామ‌గా స్థిర‌ప‌డిపోయింది. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో దాదాపు యంగ్ హీరోస్ అంద‌రితోనూ జంటగా న‌టించింది కాజ‌ల్. అంతేగాక‌.. గ‌తేడాది చిరంజీవి రీ-ఎంట్రీ ఫిల్మ్ ‘ఖైదీ నంబ‌ర్ 150’లో చిరు స‌ర‌స‌న కూడా న‌టించి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు సిధ్ధ‌మే అన్న‌ట్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలాగే.. తేజ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో హీరోయిన్‌గా మంచి ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ రెండు చిత్రాలు ఆమె కెరీర్ 10 వ‌సంతాలు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో విడుద‌ల కావ‌డం విశేషం. అంతేకాదు ఈ ప‌దేళ్ల కెరీర్‌లో ఆయా సంవ‌త్సరాల‌లో న‌లుగురు కొత్త డైరెక్ట‌ర్లు రాజ్ ఆదిత్య (‘పౌరుడు’), ఎం.శ‌ర‌వ‌ణ‌న్ (‘గ‌ణేష్ జ‌స్ట్ గ‌ణేష్’), ప్ర‌కాష్ దంతులూరి(‘ఓం శాంతి’), అజ‌య్ భుయ‌న్ (‘ద‌డ‌’)తో క‌లిసి ప‌నిచేసిన కాజ‌ల్.. కేవ‌లం 2018లోనే ముగ్గురు కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయడం కెరీర్‌లోనే అరుదైన విష‌యం.

ఒక్క‌సారి ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఏడాదిలో కాజ‌ల్ మూడు తెలుగు చిత్రాలు చేసింది. వాటిలో ఒక‌టి ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ‘అ’కాగా.. రెండోది ఉపేంద్ర మాధ‌వ్ రూపొందించిన ‘ఎం.ఎల్‌.ఎ’. ఈ రెండు చిత్రాలు కూడా ఆయా ద‌ర్శ‌కుల‌కు డెబ్యూ చిత్రాలే కావ‌డం విశేషం. ఇక ఈ శుక్ర‌వారం విడుద‌ల కానున్న ‘క‌వ‌చం’ చిత్రం కూడా ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్లకు డెబ్యూ చిత్రమే. అయితే మొద‌టి రెండు చిత్రాలు యావ‌రేజ్‌గా నిలిచినా.. ఇప్ప‌టికే అల‌రిస్తున్న‌ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో ‘క‌వ‌చం’ మాత్రం కాజ‌ల్‌కు భారీ విజ‌యాన్ని అందించేలా క‌నిపిస్తోంది. మ‌రోవైపు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ‘ఇండియ‌న్‌-2’లో కూడా హీరోయిన్‌గా అవ‌కాశం ద‌క్క‌డంతో కాజ‌ల్ ఫుల్ జోష్‌లో ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here