ఎన్టీఆర్ బయోపిక్ లో ఈషా రెబ్బా!

Eesha Rebba in Balakrishna Ntr Biopic,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Eesha Rebba in NTR Biopic,Actress Eesha Rebba Role in NTR Biopic,Heroine Eesha Rebba in NTR Biopic,Eesha Rebba to Act in NTR Biopic,Eesha Rebba Joins in NTR Biopic,NTR Biopic Movie Latest News,
Eesha Rebba in Balakrishna Ntr Biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే వారిసంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తుండగా.. ఇప్పుడు రోజుకో పేరు తెరపైకి వస్తుంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా..ఆనాడు ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్లందరి పాత్రల్లో పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు నటిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈసినిమాలో ఈషా రెబ్బా కూడా ఓ అతిధి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ క్రూషియల్ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తుందని… బాలకృష్ణ, ఈషా రెబ్బ మధ్య కొన్ని సన్నివేశాలను క్రిష్ చిత్రీకరించాడని తెలుస్తోంది. అయితే అంత క్రూషియల్ రోల్ ఏంటో తెలియాలంటే మాత్రం సినిమాలో చూడాల్సిందే. కాగా ఇటీవలే అరవింద సమేత సినిమాలో కనిపించిన ఈషా రెబ్బా…సుబ్రహ్మణ్యపురంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 9న ఫస్ట్ పార్ట్ ను జనవరి 24న రెండో పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here