భయపెట్టిస్తున్న ఎన్టీఆర్ కొత్త లుక్

Jr NTR Scaring Everyone With His New Look,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Jr NTR New Look Shocks Everyone,Jr NTR New Look in #RRR Movie,Jr NTR New Look in SS Rajamouli RRR Movie,#JrNTR,Jr NTR New Look For RRR,Jr NTR Movies Updates
Jr NTR Scaring Everyone With His New Look

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక స్టార్ హీరోలు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కుతున్న చిత్రం.. అది కూడా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా షూటింగ్ అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు పెట్టెసుకున్నారు అభిమానులు. ఇక సినిమా ప్రారంభం ముందు నుండే ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ పై తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు రాజమౌళి.

ఇక ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి కూడా తెలిసిందే. మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఎన్టీఆర్, చెర్రీలపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్‌పై సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా పాత్రలు గురించి కూడా ఇప్పటికే పలు వార్తలు హల్ చల్ చేసిన సంగతి కూడా విదితమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నా దమ్ములని, బాక్సర్లని.. ఎన్టీఆర్ విలన్ రోల్ లో నటించనున్నాడని ఇలా పలు వార్తలే వచ్చాయి.

ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ మాత్రం పలు చర్చలకు దారి తీస్తుంది. అరవింద సమేత సినిమాలో సిక్స్ ప్యాక్ తో మంచి ఫిజిక్ తో కనిపించిన ఎన్టీఆర్ తాజా లుక్ చూస్తే మాత్రం షాక్ తినాల్సిందే. గడ్డం, మీసాలు, ఒత్తైన జుట్టు, కాస్త ఒళ్లు చేసి భయపెట్టిస్తున్నాడు. ఇక ఈ లుక్‌ను చూస్తుంటే ఈ చిత్రంలో ఎన్టీఆరే విలన్‌ పాత్ర పోషిస్తున్నాడేమోనని మొదలు పెట్టేశారు. ఇక ఈ ఫొటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

అయితే ఈ ఫొటోపై స్పందించిన ఎన్టీఆర్ స్పెషల్ ట్రైనర్ లాయెడ్ స్టీవెన్ స్పందించి…సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదు.. ఇది తారక్ ప్రజెంట్ లుక్ కాదు… ఇది వన్ ఇయర్ బ్యాక్ ఫొటో అని.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు..ఖచ్చితంగా ఇప్పుడున్న పిక్ లాగ అయితే ఉండదు అని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. మరి ఇప్పటికైనా ఈ గాసిప్స్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.

కాగా ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాదే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here