సిద్దార్ద్ నా శిష్యుడే కాదు – దేవుడిని నమ్మితే పాపాలు చేయలేను

RGV Reveals Interesting Details About Bhairava Geetha Director Siddhartha,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,RGV Opens Up About Bhairava Geetha Director Siddhartha,RGV Talks About Director Siddhartha,RGV About Bhairava Geetha Movie,RGV Bhairava Geetha Director Siddhartha Latest Updates,RGV Reveals Interesting Facts About Siddhartha
RGV Reveals Interesting Details About Bhairava Geetha Director Siddhartha

రామ్ గోపాల్ వర్మ సమర్పణలో సిద్దార్ధ్ తాతోలు దర్శకత్వంలో భైరవగీత సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడ హీరో ధనంజయ్, ఇర్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యదార్ధ సంఘటన ఆధారంగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో, కాస్త బోల్డ్ కంటెంట్ తో చిత్రీకరించిన ఈసినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే రిలీజవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పి న విషయాలు

ఓ చిన్న సినిమాని మీ భుజాలపై వేసుకుని మోస్తున్నారేంటి?

‘భైరవగీత’ను నా భుజాలపై వేసుకుని మరీ ప్రమోట్‌ చేస్తున్నానని అనుకుంటున్నారంతా! అయితే… అదే నన్ను భుజాలపై వేసుకుందని నేను అనుకుంటున్నా. అథఃపాతాళానికి కూరుకుపోతున్న నన్ను ఒక చేయి ఇచ్చి పైకి లాగుతుందని నేను అనుకుంటున్నా.

ఈ సినిమా మిమ్మల్ని ఎలా పైకి తీసుకొస్తుంది?

సినిమాటిక్‌ లాంగ్వేజ్‌ అనేది చాలా అరుదుగా మారుతుంది. సినిమా అనేది కథ వల్ల లేదా స్టార్‌డమ్‌ వల్ల విజయం సాధిస్తుంది. విజయానికి బోలెడు కారణాలు ఉంటాయి. అయితే… ఒక దర్శకుడు సన్నివేశాన్ని చెప్పే విధానాన్ని నేను ‘సినిమాటిక్‌ లాంగ్వేజ్‌’ అంటాను. చాలా ఏళ్ల తర్వాత అది సిద్థార్థ దర్శకత్వంలో చూశాను. కథ బావుందా? లేదా? సినిమా బావుందా? లేదా? అనేది విడుదల తర్వాత ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఒక ఫిల్మ్‌ మేకర్‌గా సినిమా లాంగ్వేజ్‌ని నేను అర్థం చేసుకోగలను. ‘భైరవగీత’లో సినిమాటిక్‌ లాంగ్వేజ్‌ యునీక్‌గా ఉంటుంది.

మీరుచాలా మంది కొత్త వాళ్లను ఇంట్రడ్యూస్ చేశారు. కానీ సిద్దార్ద్ విషయానికొస్తే మీరు చాలా నమ్మకం పెట్టుకున్నట్టున్నారు. సిద్దార్ధ్ ను అంత ఇంప్రెస్ చేయడానికి కారణం ఏంటి?

నేను చాలా మందిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. దాదాపు ముఫ్పై, నలభై మంది డైరెక్టర్లు వచ్చుంటారు నా దగ్గర నుండి. దీని గురించి పర్టిక్యులర్ గా చెప్పడానికి ఇందాక చెప్పినట్టు ద లాంగ్వెజ్ ఆఫ్ సినిమా అనేది డిఫరెన్స్. స్టోరీ వైజ్ గా, కొన్ని సీన్స్ వైజ్ గా నేను కొన్నిసార్లు ఇంప్రెస్ అయి ఉండొచ్చు కానీ.. టోటల్ గా సినిమాటిక్ ఎస్పక్ట్ మార్చడమనేది మార్చడం తొలిసారి చూస్తున్నా.

వర్మ గారు నేటివిటీ సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు భైరవగీత తీశారు. అంటే ప్రేక్షకుల అభిరుచి మారిందని భైరవగీత తీశారా?

నేను ఫార్ములా కథలకు దూరంగా ఉంటాను. అయితే… రియలిస్టిక్‌గా సినిమాలు తీస్తా. కానీ, రాయలసీమ నేపథ్యంలో సినిమాలు చేయలేదు. అందువల్ల, ‘భైరవగీత’ విజువల్‌గా కొత్తగా అనిపించిందేమో!

కథ విషయానికి వస్తే… ‘భైరవగీత’ కథ కొత్తది కాదు. చాలాసార్లు ప్రేక్షకులు వినుంటారు. చేగువేరా నుంచి రజాకార్ల వరకూ… ఈతరం వరకూ ఏదో ట్రిగ్గర్‌ పాయింట్‌ దగ్గర రెబల్‌ అనేవాడు పుడతాడు. ఆ ట్రిగ్గర్‌ పాయింట్‌… కులం, మతం, ప్రాంతం ఏదైనా కావొచ్చు. ఎక్కువసార్లు ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య జరిగే గొడవల్లో రెబల్‌ పుడతాడు. ఆ రెబల్‌ పుట్టడానికి ఓ కారణం ఉంటుంది. ‘భైరవగీత’లో ఆ కారణం ఏంటంటే… ప్రేమకథ. పెద్దింటి అమ్మాయిని తక్కువ కులం అబ్బాయి ప్రేమించినప్పుడు… ఏం జరిగింది? రెబల్‌ ఎలా పుట్టాడు? అనేది కథ. వంశీకృష్ణ అనే వ్యక్తి కథ రాశాడు. దాన్ని నేను డెవలప్‌ చేశా. ‘కడప’ వెబ్‌ సిరీస్‌ పూర్తిగా సిద్దార్థే చేశాడు. నాకది నచ్చింది. అందుకని, ‘భైరవగీత’ అతడి చేతిలో పెట్టా. నా అంచనాలకు మించి సినిమా తీశాడు.

వర్మ శిష్యుల్లో సిద్దార్ధ్ ను ఉత్తమ శిష్యుడు అనొచ్చా?

నవ్వుతూ అతడు నా శిష్యుడు కాదు ఫస్ట్. మరి వర్మ శిష్యుడు అనే ట్యాగ్ లైన్ ఎంజాయ్ చేస్తున్నాడుగా.. అదే బయటకొస్తుంది అంటే.. తను అలా అనుకుంటాడని నేను అనుకోను… ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తున్నాడు. నాకు తెలిసి ఒకవేళ సినిమా అడిందంటే.. నెక్స్ట్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ‘రామ్‌గోపాల్‌ వర్మ ఎవరు?’ అన్నా ఆశ్చర్యం లేదు.

‘భైరవ గీత’తో ‘2.ఓ’ని పోలుస్తూ అది చిన్న పిల్లల సినిమా అన్నారు. అది సబబేనా?

అది కాంప్లిమెంట్‌గానే చెప్పా. చిన్న పిల్లల గురించి తీస్తే తప్పేముంది? పిల్లల సినిమా అయితే వాళ్లతో పాటు పెద్దలూ థియేటర్లకు వస్తారు. అందుకే శంకర్‌ విజయవంతమైన దర్శకుడు కాగలిగారు.

మీ సినిమా గురించి మీరు మాట్లాడుకోకుండా.. వేరే సినిమా (2.0) గురించి ఎందుకు?

ప్రచారం కోసం (నవ్వులు)

ఆఫీసర్‌ పై మీరూ నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అసలు తప్పెక్కడ జరిగింది?

‘ఆఫీసర్‌’ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలిస్తే… తప్పెందుకు చేస్తా? మంచి సినిమా తీస్తా కదా! ఇంతకు ముందూ చెప్పా… ఇప్పుడూ చెబుతున్నా… ఒక్కడి వల్ల సినిమా హిట్‌ కాదు. నలుగురైదుగురు వ్యక్తులు కలిస్తే… మంచి సినిమా వస్తుంది. నేనూ, నాగార్జున… ఇద్దరం ‘ఆఫీసర్‌’ కథనీ, సినిమానీ ఎంతో నమ్మాం! సినిమా చూశాక… నమ్మకంగా ఉన్నాం! అయితే… సినిమా ఆడలేదు. ఎందుకు? అంటే.. ఎవరైనా పలు కారణాలు చెప్పవచ్చు. కానీ, నేను కారణమేంటో చెప్పలేను. కారణం తెలిస్తే… అలా చేయను కదా! ముందు జాగ్రత్త పడతా. సినిమా వరస్ట్‌గా ఉందని తెలిస్తే… అసలు విడుదల చేయం కదా! సినిమా రిజల్ట్‌ వల్ల నాగార్జునకు, నాకు మధ్య రిలేషన్‌లో ఎలాంటి మార్పు లేదు. సినిమా మేకింగ్‌లో దర్శకుడితో హీరోకి డిఫరెన్సెస్‌ వస్తే…. విడుదల తర్వాత బయట పడతాయి. నాగార్జునకు, నాకు మధ్య మేకింగ్‌ టైమ్‌లో ఎలాంటి డిఫరెన్సెస్‌ లేవు. ఒకవేళ ఉంటే… విడుదలకు ముందు జరిగిన ప్రీ-రిలీజ్‌ వేడుకలో సినిమా బావుందని నాగార్జున చెప్పడు కదా! నాతో పాటూ తనూ ఎంతో నమ్మకంతో సినిమా చేశాడు. విడుదల తర్వాత ఇద్దరం కలిశాం. బాగా మాట్లాడుకున్నాం… నో ప్రాబ్లమ్స్‌!! ‘ఆఫీసర్‌’ రిజల్ట్‌ నాలో ఎలాంటి మార్పు తీసుకు రాలేదు. నేను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదు. ప్రతి సినిమాను కష్టపడి చేస్తా. సినిమా ఆడితే… ఒళ్లు దగ్గర పెట్టుకుని తీశాడంటారు. లేదంటే.. రివర్స్‌లో చెబుతారు.

ఈ మధ్య తిరుపతి కూడా వెళ్లారు. మీలో ఏంటి ఈ మార్పు. ట్రూ ఫైత్ అంటారా మీలో వచ్చిన అధ్యాత్మిక చింతన?

నన్ను చూస్తుంటే ఫైత్ లాగ కనిపిస్తున్నానా..? (నవ్వులు). జోక్స్ ఏ పార్ట్…ఎన్టీఆర్‌గారికి, తిరుపతికి ఎంతో అనుబంధం ఉంది. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నట్టు తిరుపతిలో ప్రకటించారు. తిరుపతిలో ఆయన పార్టీ కీలక సభలు జరిగాయి. అందుకని, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని అటువంటి ప్రదేశంలో ప్రారంభించా. అయితే… నేను తిరుపతి వెళ్లడంతో ఆశ్చర్యపోయారంతా! కానీ, ఇక్కడ ఓ విషయం గమనించాలి. ‘నేను దేవుడిని నమ్మను’ అని ఎప్పుడూ చెప్పలేదు. ‘భక్తులను నమ్మను’ అన్నాను. నమ్మకపోవడానికి కారణం ఏంటంటే… దేవుడిని నమ్మితే భయంతో నేను చేసే చాలా పాపాలు చేయలేను. అందుకని, నాకు తోచినవన్నీ చేసి చచ్చిపోయే ముందు ‘నారాయణ’ అంటాను.

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌కు దర్శకుడిగా మీకు అవకాశం రాలేదని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మొదలెట్టారా?

ఎన్టీఆర్‌ బయోపిక్‌కి దర్శకత్వం వహించే దక్కలేదని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రారంభించలేదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రారంభ దశలో క్యాజువల్‌గా ఒకసారి మాట్లాడుకున్నాం. అంతకుమించి ముందుకు కదల్లేదు. ఎన్టీఆర్‌ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనే అంశంపై నాకు ఎప్పట్నుంచో ఇంట్రెస్ట్‌. ఎన్టీఆర్‌ జీవితంలో ఈ ఒక్క అంశంలో ఎక్కువ డ్రామా, కాంఫ్లిక్ట్‌ ఉన్నాయని నా ఉద్దేశం, నమ్మకం! బాలకృష్ణగారు నటించే సినిమాలో ఈ అంశం ఉండదనుకుంటున్నా. వాళ్లు ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ గురించి… సినిమాల్లోకి, రాజకీయాల్లోకి ఎలా వచ్చారనేది చూపిస్తున్నారట! నాకు వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌గారి జీవితంలో చివరి సంవత్సరాల్లో చీకటి రోజులంటే ఇంట్రెస్ట్‌. వాళ్ల కథకూ, నా కథకూ అసలు సంబంధమే లేదు.

ఈ సారైనా మీరు ఓటు వేస్తారా?

నా జీవితంలో ఎప్పుడూ ఓటేయలేదు. ఇప్పుడూ వేయను. అధికారంలో ఎవరున్నా నా జీవితంలో పెద్దగా వచ్చే మార్పులు ఉండవు. నాకు రాజకీయాల గురించి తెలీదు. తెలుసుకునే తీరికా నాకు లేదు. అమెరికా రాజకీయాలంటే మాత్రం చాలా ఆసక్తి. అక్కడ ట్రంప్‌ గెలుస్తాడని నేను ముందే చెప్పా.

పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో పోటీచేస్తే తప్పకుండా ఓటేస్తా అని ఓ సందర్భంలో మీరే చెప్పారు కదా?

నేను అప్పుడప్పుడూ రకరకాల ప్రేలాపనలు చేస్తుంటాను. అవన్నీ సీరియస్‌గా తీసుకోకూడదు.

‘మీ టూ’ ఉద్యమంపై మీ స్పందనేంటి?

అందులో నేనొక్కడినే లేను. రామూ అలాంటోడు ఇలాంటోడు అని అందరూ చెబుతారు. ఇప్పుడు నా పేరు తప్ప అందరి పేర్లూ బయటకు వచ్చాయి. నా పేరు లేకపోవడం చూసి బాలీవుడ్‌ మొత్తం షాకైంది. ‘నేను చాలా పవిత్రుణ్ని’ అన్నవాళ్లే ముందు దొరికేస్తారు. నేనేమో పొద్దున్న లేస్తే తొడల గురించి మాట్లాడతా, జీఎస్‌టీ లాంటి సినిమాలు తీస్తా.. ఇక నా గురించి ఏం చెబుతారు?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here