అమర్ అక్బర్ ఆంటొని తెలుగు మూవీ రివ్యూ

Amar Akbar Anthony Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Latest Telugu Movie Reviews,Amar Akbar Anthony Movie Review,Amar Akbar Anthony Review,Amar Akbar Anthony Movie Public Talk,Amar Akbar Anthony Telugu Movie Public Response,Amar Akbar Anthony Movie Story,Amar Akbar Anthony Telugu Movie Live Updates,Amar Akbar Anthony Movie Review & Rating,Amar Akbar Anthony Telugu Movie Plus Points
Amar Akbar Anthony Telugu Movie Review

చాలా కాలం నుండి మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీనువైట్ల మరోసారి మాస్ మహారాజ్ రవితేజ తో కలిసి తెరకెక్కించిన సినిమా అమర్ అక్బర్ ఆంటొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పోస్టర్ రిలీజ్ నుండే ఈ సినిమాపై ఆసక్తిని రేకేత్తించి…టీజర్, ట్రైలర్ తో అంచనాలను భారీగా పెంచేశాడు. ఇక రవితేజ కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలియానా కూడా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఇన్ని అంచనాల మీద అమర్ అక్బర్ ఆంటొని సినిమా ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి శ్రీనువైట్ల, రవితేజకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చిందా… ఇలియానాకు మంచి కమ్ బ్యాక్ అయిందా?లేదా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:

రవితేజ (అమర్), ఇలియానా (ఐశ్వర్య) ఫాదర్స్ ఇద్దరూ బిజినెస్ పార్టనర్స్. దాంతో చిన్నప్పటినుండి రవితేజ, ఇలియానా ఫ్రైండ్స్ గా ఉంటారు. అయితే వాళ్ల ఫాదర్స్ విలన్ గ్యాంగ్ ను నమ్మి పార్టనర్స్ గా చేసుకుంటారు. కానీ విలన్ గ్యాంగ్ రవితేజ, ఇలియానా ఫ్యామిలీస్ ను చంపి బిజినెస్ మొత్తం టేకోవర్ చేసుకోవాలని చూస్తారు. ఈక్రమంలో వాళ్ల పేరెంట్స్ ను చంపేస్తారు. ఇక ఇవన్నీ తెలుసుకున్న రవితేజ ఆ విలన్ గ్యాంగ్ ను ఎలా చంపుతాడు.. చిన్నప్పుడు విడిపోయిన ఇలియానా మళ్లీ ఎలా కలుస్తుంది..?ఇద్దరూ తమ రివేంజ్ ను ఎలా తీర్చుకుంటారు అన్నదే ఈ కథ.

విశ్లేషణ:

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన రవితేజ మూడు పాత్రల్లో రెచ్చిపోయి నటించాడని చెప్పొచ్చు. కేవలం మాస్ ఎలిమెంట్సే కాదు.. క్లాస్ ఎలిమెంట్స్ కూడా అన్నీ కలగలిపి మంచి సినిమాతో వచ్చాడు.

ఇక ఇలియానా కు కూడా మంచి రీ ఎంట్రీ అని చెప్పొచ్చు. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన.. ఇలియానా తన గ్లామర్, నటనతో మెప్పించింది. ఒకరకంగా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ శ్రీనువైట్ల గురించి. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీనువైట్లకు మంచి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. తన మూస ధోరణి మార్కును వదిలి సరికొత్త సబ్జెక్ట్‌తో అమర్ అక్బర్ ఆంటోనిని తెరకెక్కించినట్టు స్పష్టమవుతున్నది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం శ్రీను వైట్ల కెరీర్‌ను మలుపు తిప్పే అంశంగా మారింది. శ్రీనువైట్ల కథ, కథనాల్లో వైవిధ్యం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఫ్లాష్ బ్యాక్ కథను మలిచిన తీరు బాగుంది. ఇక ఇంటర్వెల్ సమయానికి రవితేజకు సంబంధించిన మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ ని దర్శకుడు చూపించిన విధానం కూడా బావుంది.

ఇక తమన్ సంగీతం కూడా ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికే డాన్ బ్రాస్కో సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బావుంది. సునీల్, సత్య, వెన్నెల కిషోర్ కామెడీతో ఫుల్ గా నవ్వుకోవచ్చు. అమెరికా లొకేషన్స్ చాలా బాగున్నాయి. నిర్మాతలు ఏ మాత్రం రాజీపడకుండా ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.

ప్లస్ పాయింట్స్:

* నటీ నటులు
* కథ, కథనం
* థమన్ సంగీతం
* సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్:

* అక్కడక్కడా స్లోగా సాగే సన్నివేశాలు
* కొన్నిచోట్ల అసందర్భ కామెడీ సీన్స్

ఓవరాల్ గా యాక్షన్ కామెడీ డ్రామాగా వినోదం, మాస్ ఎలిమెంట్స్ తదితర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here