విలన్ రోల్స్ పై క్లారిటీ ఇచ్చిన రవితేజ!

Hero Ravi Teja Movies Latest News,Ravi Teja Shows Interest in Villain Roles,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Ravi Teja About Villain Roles,Ravi Teja Shows Interest in Villain Characters,Mass Maharaja Ravi Teja Interest in Negative Characters,Hero Ravi Teja to Play Villain Roles
Ravi Teja Shows Interest in Villain Roles

అమర్ అక్బర్ ఆంటోని సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో తాను మూడు పాత్రల్లో కనిపిస్తుండగా…తాను పోషించిన అమర్ అక్బర్ ఆంటోని పాత్రలు మూడు కూడా వేటికవే వైవిధ్యభరితమైనవని…అయితే అమర్, అక్బర్, ఆంటొని పాత్రల్లో తనకి అమర్ పాత్ర బాగా నచ్చిందని.. ఇక అమర్ పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాడు.

మరి విలన్ రోల్స్ పై కూడా స్పందించిన రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి నాకు ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను తప్పకుండా చేస్తాను. అందులో కూడా వైవిధ్యభరిత పాత్రలు అయితేనే చేస్తానని అన్నారు. మరి టాలీవుడ్ లో కి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించి..ఆతరువాత పూరీ డైరెక్షన్ లో ఇడియట్ సినిమాలో హీరోగా నటించి అది సూపర్ హిట్టవ్వడంతో మాస్ మహారాజాగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి ఇప్పుడు విలన్ పాత్రలు కూడా చేయడానికి రెడీ అని చెబుతున్నాడు. ఇప్పటికే ఒకప్పుడు హీరోలుగా చక్రం తిప్పిన హీరోలు ఇప్పుడు విలన్ గా కూడా తమ సత్తాను చాటుతున్నారు. మరి చూద్దాం రవితేజ విలన్ గా చేసే ఆ తరుణం ఎప్పుడొస్తుందో..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here