సర్కార్ ఖాతాలో మరో రికార్డ్ – రజినీ తర్వాత విజయే

Sarkar Collections Breaking All Records,2018 Telugu Movie News, Highest Grossing Tamil Movies 2018, Latest Telugu Cinema Updates, Sarkar Blockbuster of the Decade 200 Cr Club, Sarkar Box Office Collections, Sarkar Enters 200 Crore Club, Sarkar Joins the 200 Crore Club, Sarkar Movie Collections, Sarkar Movie Enters 200 Crore Club in 6 Days, Telugu Film News, Vijay Sarkar Movie 200 Crore Collection
S.P.Balasubramanian Hums the Tunes For Lakshmi's NTR

తమిళ సూపర్‌స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్న వర్షం కరిపిస్తుంది. సర్కార్ సినిమా రిలీజ్ ముందు నుండే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ తరువాత అయితే చెప్పనక్కర్లేదు.. ఈసినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ… వాటిని తొలగించాలంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు రచ్చ రచ్చ చేసిన సంగతి కూడా విదితమే. మురుగదాస్ పై కేసులు పెట్టారు, థియేటర్లు ధ్వంసం చేసారు కానీ ఇవేమి సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలను ఆపలేకపోయాయి. ఎన్ని వివాదాలు తలెత్తినా…వాటన్నింటిని అధిగమించుకుంటూ సర్కార్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.

సినిమా విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు
తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ.. 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇంకో రికార్డ్ ఏంటంటే.. ఇప్పటివరకూ రజనీ కాంత్ కి తప్ప మరే హీరో 200 కోట్ల క్లబ్ లో చేరలేదు. కానీ ఇప్పుడు విజయ్ కూాడా ఆ క్లబ్ లో చేరిపోయాడు. మొత్తానికి వివాదాలు వివాదాలే..కలెక్షన్లు కలెక్షన్లే అన్నట్టు… విజయ్ సర్కార్ సినిమాను మాత్రం ఏ వివాదాలు ఆపలేకపోయాయి. ముందు ముందు ఇంకెన్ని కలెక్షన్లు రాబడుతున్నాయో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here