ఓటు హక్కు పై ప్రణీత – అప్పుడే ప్రశ్నించే హక్కు వస్తుంది

Pranitha Subhash Talks About Importance of Vote,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Pranitha Subhash Latest News,Pranitha Subhash Talks About of Vote,Pranitha Subhash Upcoming Movies Updates,Heroine Pranitha Latest Details
Pranitha Subhash Talks About Importance of Vote

సర్కార్ సినిమాలో ఓటు గురించి.. ఓటు హక్కు గురించి మురగదాస్ ఎంత బాగా చెప్పాడో సినిమా చూసిన వారందరికీ తెలిసే ఉంటది. అంతేకాదు ఈ నేపథ్యంలోనే 49 పీ సెక్షన్ గురించి కూడా బాగా చెప్పారు. 49 పీ చట్టం అనేది ఒకటుందని.. తమ ఓటు హక్కును ఎవరైనా ఉపయోగిస్తే వెంటనే యాక్షన్ తీసుకొని..తమ ఓటు హక్కును తాము ఉపయోగించుకోవచ్చని చాలా చక్కగా చెప్పారు.

ఇప్పుడు తాజాగా ఓటు హక్కు గురింతి కూడా స్పందించింది. తాజాగా ఓటు హక్కు వినియోగంపై మాట్లాడిన ప్రణీత మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఓటు తప్పనిసరిగా వెయ్యాలి. అది మన హక్కు. మన సమస్యను నాయకుల ముందు ఉంచాలన్నా, వారి బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకపోయినా నిలదీసే హక్కు మనకుండాలి. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రశ్నించే హక్కు వస్తుంది. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడంలో నాయకులు మాట తప్పారేమో. కానీ, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఆ హక్కుని దుర్వినియోగపరచలేదు. గత ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోండి అని ప్రచారం కూడా చేశా అంటూ చెప్పింది. దీంతో ప్రణీత వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here