ఇద్దరు ముంబై భామలతో కార్తికేయ

Mumbai Girls Digangana Suryavanshi and Jazba Singh for Karthikeya New Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Hippi Movie Latest Updates,Hippie Movie Actress Updates,karthikeya to Work With Stunning Actress For His Next Project,Mumbai Girls Digangana Suryavanshi and Jazba Singh for Karthikeya Hippi Movie,RX100 Karthikeya Next Project With Stunning Female Actress,Hippi Telugu Movie Latest News,New Actress in Tollywood Movies
Mumbai Girls Digangana Suryavanshi and Jazba Singh for Karthikeya New Movie

ఆర్ఎక్స్ 100 సినిమా విజయం తరువాత మంచి ఫామ్ లో ఉన్నాడు కార్తికేయ. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్న కార్తికేయకు, పాయల్ కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే పాయల్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కార్తికేయ ప్రస్తుతం తను హిప్పీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొత్త హీరోయిన్స్ అయితే బావుంటుందని..ఫ్రెష్ లుక్ ఉంటుందని ముంబై భామ‌లు దిగాంగ‌న సూర్య‌వంశీ, జ‌జ్బా సింగ్ లని క‌థానాయిక‌లుగా ఫైన‌ల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. కాగా తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం.. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here