అర్థవంతం- సంస్కారవంతం అల్లు అర్జున్ స్పీచ్

Allu Arjun Delivers a Powerful Speech At Taxiwaala Pre Release Event, Allu Arjun Graces the Pre Release Event of Taxiwaala, Allu Arjun Speech at TaxiWaala Pre Release Event, Allu Arjun Speech From Taxiwaala Pre Release Event, Latest Telugu Movies 2018, TaxiWaala Pre Release Event Highlights, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News

తమ గొప్పను గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం ఎదుటి వారి గొప్పను తగ్గించి మాట్లాడుతుంటారు చాలామంది. అంటే తమ గోరంత గొప్ప గురించి కొండంతగా చెప్పుకోవటం ఎదుటివారి కొండంత గొప్ప గురించి గోరంతగా మాట్లాడటం
మానవ నైజం. కానీ చాలా అరుదుగా ఆ నైజానికి విరుద్ధమైన స్టేట్మెంట్స్ వినటం జరుగుతుంది.

మొన్న జరిగిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడిన స్పీచ్ నిజంగా చాలా అరుదైనది.. చాలా అర్ధవంతమైనది… చాలా సంస్కారవంతమైనది అని చెప్పవచ్చు.

ఒక ఎమర్జింగ్ హీరోగా విజయ్ దేవరకొండ ఎదుగుదలను అభినందిస్తూ “ విజయ్ ఒక సెల్ఫ్ మేడ్ హీరో.. నన్ను లాంచ్ చేసినప్పుడు నాకు అల్లు అరవింద్ గారు, రాఘవేంద్ర రావు గారు వంటి పెద్దల సపోర్ట్ ఉంది. కానీ విజయ్ వెనక ఎవరూ లేరు. ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్స్ తో స్వయంగా ఎదిగిన సెల్ఫ్ మేడ్ హీరో విజయ్. కానీ నేను సెల్ఫ్ మేడ్ హీరోను అని ఎప్పటికీ క్లెయిమ్ చేసుకోలేను…. ఇలా సాగిన అల్లు అర్జున్ స్పీచ్ నిజంగా తన సంస్కారానికి అద్దం పట్టింది.

ఒక సాటి హీరో ఫంక్షన్ కు గెస్ట్ గా రమ్మంటే రకరకాల ఫోజులు , బిల్డప్పులు ఇచ్చే హీరోలు చాలామంది ఉన్నారు. ఒకవేళ వచ్చినా దానిని తమ స్వోత్కర్ష కు వాడుకుంటారే తప్ప బన్నీ లాగా from the bottom of the heart అన్నట్లుగా మాట్లాడటం చాలా అరుదు. నిజానికి ఆరోజు టాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ మాట్లాడిన తీరు చాలా మెచ్యూర్డ్ గా, చాలా మీనింగ్ ఫుల్ గా అనిపించింది.

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎదుగుతున్న విజయ్ దేవరకొండ లాంటి ఒక రైజింగ్ హీరో గురించి గొప్ప మెగా నేపద్యం ఉన్న అల్లు అర్జున్ లాంటి స్టార్ అంత ప్రశంసాపూర్వకంగా మాట్లాడటం వ్యక్తిగతంగా తన సంస్కారాన్నే కాదు చిత్రపరిశ్రమలోని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా రిప్రజెంట్ చేసినట్లుగా అనిపించింది.

” నన్ను నేను ఎప్పటికీ సెల్ఫ్ మేడ్ అని క్లెయిమ్ చేసుకోలేను అనటం అల్లు అర్జున్ డౌన్ టు ఎర్త్ నేచర్ కు నిదర్శనం కావచ్చు. అయితే తనకు గొప్ప సినీ నేపథ్యం ఉన్న మాట నిజమే అయినప్పటికీ అది ఒక్కటే అతన్ని ఇంత పాపులర్ స్టార్ గా నిలబెట్టలేదు. తన హార్డ్ వర్క్, తన సిన్సియారిటీ, తన ప్యాషన్- ఇవే అల్లు అర్జున్ కు ఇంత మంచి లాంగ్ అండ్ స్ట్రాంగ్ స్టాండింగ్ ను ఇచ్చాయి.
నిజానికి తన సినీ నేపథ్యం తన పరిచయానికి ఉపయోగపడింది తప్ప తన ప్రాభవానికి కాదు.

అల్లు రామలింగయ్య గారి మనవడిని, అరవింద్ గారి కొడుకుని, మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడిని కాబట్టి ఆ నేపధ్యమే నన్ను నిలబెడుతుంది అన్న ఆలోచన గానీ, అలసత్వం గానీ అల్లు అర్జున్ నటనలోనూ, నడత లోనూ మచ్చుకైనా కనిపించవు. ఒంటిని వింటిలా వంచి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడితేనే ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్న స్టార్ డమ్ వచ్చింది తప్ప అది నేపధ్య బిక్ష కానే కాదు. నేపధ్యం వల్లనే స్టార్ డమ్ వచ్చి పడేట్లయితే హీరోలుగా పరిచయమైన సినిమా వాళ్ళ కొడుకులందరూ సూపర్ స్టార్లు, సుప్రీం స్టార్లు అయి కూర్చునే వాళ్ళు. గొప్ప గొప్ప నేపద్యాలతో హీరోలుగా పరిచయమై తొలి సినిమాయే ఆఖరి సినిమా అయి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

కాబట్టి సినీ నేపథ్యం పరిచయానికి పనికొస్తుందే తప్ప స్టార్ డమ్ తెచ్చి పెట్టడానికి కానే కాదు. తన నేపద్యపు అండ చూసుకుని సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా అల్లు అర్జున్ “టేక్ ఇట్ ఈజీ” గా తీసుకోలేదు. అప్పటికీ ఇప్పటికీ ప్రతి సినిమాను తొలి సినిమాగా భావించే భయభక్తులను తన “మెంటార్” అయిన మెగాస్టార్ చిరంజీవి నుండి అలవర్చుకున్నారు అల్లు అర్జున్.

కాబట్టి అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ను సెల్ఫ్ మేడ్ హీరో గా అభినందించటం ఎంత అభినందనీయంగా ఉందో తను “సెల్ఫ్ స్టాండింగ్ స్టార్” గా ఎదగటం – వెలగటం కూడా అంతే అభినందనీయం.
Really its a wonderful and lovable gesture of your character Dear Bunny… keep it up.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here