వినయ విధేయ రామ టీజర్ రిలీజ్ – రామ్.. రామ్ కొణిదెల ఇక్కడ

#VinayaVidheyaRamaTeaser, latest telugu movies news, Ram Charan New Movie Vinaya Vidheya Rama Teaser, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vinaya Vidheya Rama Movie Teaser Out Now, Vinaya Vidheya Rama Movie Updates, Vinaya Vidheya Rama Official Teaser, Vinaya Vidheya Rama Teaser, Vinaya Vidheya Rama Telugu Movie Latest News, Vinaya Vidheya Rama Telugu Movie Teaser
Vinaya Vidheya Rama Movie Teaser Out Now

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ ను రెండు రోజుల క్రితం విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్ ను చూస్తే..యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేసినట్టు తెలుస్తోంది. బోయపాటి మార్క్ కు తగినట్టే భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

బోయపాటి మార్క్‌ మాస్‌ క్యారెక్టర్‌లో చరణ్‌ ఇరగదీశాడు. 49 సెకన్ల ఈ టీజర్‌ను మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో పవర్‌ ప్యాక్డ్‌గా రెడీ చేశారు. ముఖ్యంగా టీజర్ లో వచ్చిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. అన్నాయ్.. వీడిని భయపెట్టాలా..? చంపేయాలా..? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట ఏదైనా ఒకే అనే డైలాగ్ విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ లో.. పందెం పరుశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్.. రామ్.. కొణిదెల అని బల్లగుద్ది రాంచరణ్ చెప్పే డైలాగ్ కి అయితే మెగా ఫ్యాన్స్ విజిల్ వేయకుండా ఉండరేమో. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి

కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here