డే వన్ కలెక్షన్స్ లో బాహుబలి – 2 ను దాటి బొక్క బోర్లా పడ్డ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్

Thugs of Hindostan Beats Baahubali First Day Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies,Thugs of Hindostan Movie 1st Day Collections,Thugs of Hindostan First Day Collections Beats Baahubali Collections,Thugs of Hindostan Collections Verses Baahubali Collections,Thugs of Hindostan Movie First Day Box Office Collections,Thugs of Hindostan Beats Baahubali 1st Day Collections
Thugs of Hindostan Beats Baahubali First Day Collections

దేశమంతా ఎదురు చూసిన “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” డిమానిటైజేషన్ రోజైన నవంబర్ 8న విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా చరిత్ర సృష్టిస్తుంది. డిమానిటైజేషన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలయిందో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ దెబ్బకు ఇండియన్ ఫిలిం ట్రేడ్ అలాగే విలవిలలాడే పరిస్థితి కనిపిస్తుంది.

రెండు నెలల క్రితమే విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ చూసి ఆహో ఓహో… ఇంకేముంది బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టేసుద్ది… తెరలు చించేసుద్ది … అన్నారు కొందరు అతి ఔత్సాహిక విశ్లేషకులు..

కానీ “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” ఒక స్పెషల్ ఆర్టికల్ లో ఈ సినిమా విజయావకాశాలపై ఆరోజునే సందేహం వెలిబుచ్చింది. ఆ సందేహం నిర్మాత ఆదిత్య చోప్రా మేకింగ్ వాల్యూస్ గురించి కాదు, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ల కాంబినేషన్ వ్యాల్యూ మీద డౌట్ కాదు.. కేవలం ఆ చిత్ర దర్శకుడు విజయకృష్ణ ఆచార్య డైరెక్షన్ మీద మాత్రమే మా సందేహం అంతా కేంద్రీకృతమైంది.

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ నిన్న విడుదలై పరాజయానికి పరాకాష్టగా పేరు తెచ్చుకుంది కాబట్టి ఈరోజు ఇలా అనటం లేదు.2018 అక్టోబర్ 1న “తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్” లో రాసిన ఒక స్పెషల్ ఆర్టికల్ లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ విజయం సందేహాస్పదమే అని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. కేవలం గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగులు భారీ తారాగణం వంటి కమర్షియల్ హంగు పొంగులతో సినిమాలు హిట్ అవ్వవు అనటానికి మరొక తాజా ఉదాహరణగా నిలిచింది నిన్నటి “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్”.

కంటెంట్ మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా కేవలం కాంబినేషన్స్, భారీ ప్రజెంటేషన్ లతో బాహుబలి రికార్డుల మీద కన్నేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.

నిజానికి సినిమాలో విషయం ఉంటే ఎవరికైనా ఎంతటి ఘనవిజయాన్ని కట్టబెట్టడానికైనా ప్రేక్షకులు సిద్ధమే అనడానికి “డే వన్ కలెక్షన్స్” లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాహుబలి2 కలెక్షన్స్ ను అధిగమించడమే ఉదాహరణ. Baahubali 2 మొదటి రోజు కలెక్షన్స్ 43 కోట్ల చిల్లర కాగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కలెక్షన్స్ 52 కోట్ల పై మాటే. అంటే ఈ సినిమా మీద ప్రేక్షకులు ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారో … వారిని దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య అంత దారుణంగా నిరాశపరిచాడు.

మొత్తానికి Baahubali 2 రికార్డ్స్ ను టచ్ చేస్తాయి అని అంచనాలు ఉన్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, రజనీకాంత్ 2 .0 చిత్రాలలో మొదటి త్రెట్ తొలగిపోయింది. ఇక రెండవదైన2.0 ఈనెల 29న విడుదల కానుంది. సంచలన విజయాన్ని సాధించిన రోబో కాంబినేషన్ తో పాటు దాని సీక్వెల్ గా అంతకు మించిన బడ్జెట్ తో, గ్రాఫిక్ ఎక్సలెన్సీ తో రూపొందుతున్న చిత్రం కావడంతో2.0 బాహుబలి2 రికార్డ్స్ ను ఏ మేరకు అందుకుంటుందో వేచి చూడాలి.

అయితే ఈ సందర్భంగా మనలో ఒక చిన్న స్వార్థం ఉండటం న్యాయం అనిపిస్తుంది. మన బాహుబలి2 రికార్డులను అందుకునే రెండవ సినిమా కూడా మన తెలుగు సినిమాయే కావాలి అన్నదే ఆ స్వార్థం. ప్రస్తుతం తెలుగులో ఆ స్థాయి, ఆ అంచనాలు ఉన్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న “సైరా”. కాబట్టి తన బాహుబలి రికార్డులను టచ్ చేసే తదుపరి సినిమా “సైరా” అయితే మనందరి కంటే ఎక్కువగా సంతోషించే వ్యక్తి రాజమౌళియే.

 

నెల రోజుల క్రితమే “థగ్స్ ఆఫ్ హిందూస్థాన్” జాతకం చెప్పిన “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్“:

 

Here Is the reference Article published on 01-10-2018:

 


Click Here : ఆ రెండూ బాహుబలి ని దాటతాయా?..సరితూగుతాయా? తగ్గుతాయా ?

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here