రామ్ చరణ్ హీరోగా బెస్టే కానీ నిర్మాతగా ద బెస్ట్ అంటున్న సైరా యూనిట్

Latest Telugu Movies 2018, Ram Charan About Sye Raa Movie, Sye Raa Movie Latest Updates, Sye Raa Producer Ram Charan Latest News, Sye Raa Team About Ram Charan, Sye Raa Team Hails Producer Ram Charan, Sye Raa Team Latest News, Sye Raa Unit Hails Producer Ram Charan, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Sye Raa Unit Hails Producer Ram Charan

హీరోలు సొంత చిత్ర నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. చిత్తూరు నాగయ్య గారి కాలం నుండి హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్న చరిత్ర మనకు తెలుసు. అయితే కొంతమంది హీరోలకు , నటీనటులకు తాము నిర్మాతలుగా మారగానే ఎక్కడ లేని జాగ్రత్త , పొదుపు గుర్తుకొస్తాయి. ప్రొడక్షన్ లో వేస్టేజ్ గురించి గుండెలు బాదుకుంటుంటారు. బయట చిత్రాలలో తాము చేస్తున్నప్పుడు ప్రతి విషయానికి నిర్మాతలను సతాయించే హీరోలు సొంత సినిమా దగ్గరికి వచ్చేసరికి పారితోషికాలు, కాస్ట్యూమ్స్, మేకప్ , సెట్టింగులు చివరకు భోజనాల దగ్గర కూడా గీసి గీసి బేరాలు ఆడతారు.

అయితే సొంత సినిమాలు తీసే కొందరు హీరోలు మాత్రం అందుకు భిన్నంగా ఆర్టిస్టులను, టెక్నీషియన్లను బాగా చూసుకుంటారు. ప్రస్తుతం నిర్మాతగా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంత సంస్థ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ కు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు వస్తుంది. యూనిట్ లో ప్రతిఒక్కరూ కొణిదెల వారి ట్రీట్మెంట్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సైరా చిత్రాన్ని రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇటీవల జార్జియాలో జరిగింది. ఆ సమయంలో ఆర్టిస్టులకు, యూనిట్ మెంబర్స్ కు కొణిదెల ప్రొడక్షన్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ గొప్ప మెమరీగా నిలిచిపోతుందట.

ట్రీట్మెంట్ విషయంలోనే కాదు… అంత భారీ షెడ్యూలును ఏ మాత్రం మిస్ ప్లానింగ్ లేకుండా చాలా గొప్పగా డిజైన్ చేశారట రామ్ చరణ్. సాధారణంగా షూటింగ్ విశేషాలు అంటే క్యాస్టింగ్ గురించి, సెట్టింగ్స్ గురించి, తెర మీద కనిపించే భారీతనం గురించి చెప్పుకుంటారు. కానీ నిర్మాతల ట్రీట్మెంట్ గురించి ప్రత్యేకించి ప్రశంసా పూర్వకంగా మాట్లాడుకోవడం విశేషం. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన ఇలాంటి పేరు గుర్తింపు రావు.

మంచి మనసుతో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కార్యదక్షతతో పనిచేసినప్పుడే ఇలాంటి అరుదైన ప్రశంసలు లభిస్తాయి. నిజానికి చిత్ర నిర్మాణ రంగంలో కాకలు తీరిన అనుభవజ్ఞులైన నిర్మాతలకు కూడా వేస్టేజ్ ని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు. ఒకవైపు కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నా ట్రీట్మెంట్ బాగాలేదనే బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఇంత చిన్న వయసులోనే రామ్ చరణ్ ప్రొడక్షన్ వ్యవహారాలను అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్వహిస్తూ యూనిట్ సభ్యుల అభినందనలు అందుకోవటం నిజంగా అభినందనీయం.

కంగ్రాట్యులేషన్స్ అండ్ కీప్ ఇట్ అప్ మిస్టర్ మగధీరా !

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here