సర్కార్ కు తమిళ సర్కార్ వేడి – అప్పటివరకూ అరెస్ట్ చేయడానికి వీల్లేదు

A.R.Murugadoss Walks into Trouble, Director A.R.Murugadoss Latest Updates, Director A.R.Murugadoss Movies Latest News, Latest Telugu Movies, Sarkar Director A.R.Murugadoss Walks into Trouble, Sarkar Director AR Murugadoss Gets an Anticipatory Bail, Sarkar Movie Director Walks into Trouble, Sarkar Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Sarkar Director AR Murugadoss Gets an Anticipatory Bail

తమిళ స్టార్ హీరో విజయ్, స్టార్ డైరెక్టర్ మురగదాస్ సినిమా దీపావళి కానుకగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కు ముందే సినిమా పలు వివాదాల్లో ఇరుక్కోగా…ఇప్పుడు రిలీజైన తరువాత కూడా తలనొప్పులు వస్తూనే ఉన్నాయి. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత గురించి మురగదాస్ ఈ సినిమాలో చాలా చక్కగా వివరించాడు. అయితే రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అలాగే ఈసినిమాకు కూాడా అలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. సినిమాలో రాజకీయ పార్టీలను కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను విమర్శించేలా ఉన్న కొన్ని కాంట్ర‌వ‌ర్సీ సీన్స్.. డైలాగ్స్ వెంట‌నే తొల‌గించాల‌ని.. తొల‌గించే వ‌ర‌కు ఆందోళన చేస్తామని అన్నాడిఎంకె పెద్ద ఎత్తున్న నిరసన చేశారు. కొన్ని చోట్ల సినిమా ఫ్లెక్సీలు, పోస్టర్లు కూడా చింపేశారు. దీంతో కొన్ని సీన్లను తీసేయడానికి చిత్రయూనిట్ అంగీకరించినట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ నుండి అప్రూవల్ లెటర్ కూడా రావడంతో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించి.. రీఎడిట్ చేసిన వెర్షన్ ప్రదర్శన చేస్తాం…’ అని వెస్ట్ జోన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్. సుబ్రహ్మణ్యం ఇప్పటికే తెలిపినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే మురదాస్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన మురగదాస్..పొద్దుపోయిన తరువాత తన ఇంటికి పోలీసులు వచ్చారని… మా ఇంటికి పోలీసులు వచ్చి తలుపులను బాగా కొట్టారు. ఆ సమయంలో నేను అక్కడ లేకపోవడంతో కాసేపటికి వెళ్లిపోయారు… ఇప్పుడు నా ఇంటి వద్ద పోలీసులు లేరు’’ అంటూ ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా..ఈ గొడవల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మురగదాస్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడమే కాకుండా.. నవంబర్ 27వరకూ అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఈ గొడవలు ఇక్కడితో ఆగుతాయా.. లేదా? ఇంకా ఉదృతం అవుతాయా చూద్దాం ఏం జరుగుతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here