కె.జి.యఫ్ తెలుగు మూవీ ట్రైలర్ రిలీజ్

#KGFTrailer, KGF Movie Theatrical Trailer, KGF Movie Trailer, KGF Movie Updates, KGF Telugu Movie Latest News, KGF Telugu Movie Official Trailer, KGF Telugu Movie Trailer Out Now, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
KGF Telugu Movie Trailer Out Now

శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ‘కె.జి.ఎఫ్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం రీ – రికార్డింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవల విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా ..సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా 70వ దశాబ్ధకంలో కోలార్ బంగారు గనుల వ్యవహారంలో అప్పటి మాఫియా నేపధ్యంలో జరిగిన కథతో.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరంగధూర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాకింగ్ స్టార్’ యాష్ ‌, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనంత్‌నాగ్‌, అచ్యుత్‌రావు, అయ్యప్ప .పి.శర్మ తదితరులు నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్న ఓ ప్రత్యేక పాటలో నటిస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: భువన్‌ గౌడ, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌, సంగీతం:రవి భసూర్‌, పాటలు:రామజోగయ్య శాస్త్రి, మాటలు:హనుమాన్‌ చౌదరి అందిస్తున్నారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here