బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం ఫస్ట్ లుక్ రిలీజ్

Bellamkonda Sai Srinivas Next Project in Pipeline,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Bellamkonda Sai Srinivas Next Project Details,Bellamkonda Sai Srinivas Movies Latest Movies Updates,Bellamkonda Sai Srinivas Upcoming Project News,Bellamkonda Sai Srinivas New Movie Latest News,#BSS5 First Look Out Now,#BSS5 First Look,Bellamkonda Sai Srinivas New Movie First Look
#BSS5 First Look Out Now

ప్రస్తుతం వరుస సినిమాలంతో బిజీగా ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ మంచి స్పీడుమీదున్నాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రస్తుతం ఓ ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

పోలీస్ డ్రస్ లో ఉన్న సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేశారు. అంతేకాదు ఇప్పటివరకూ టైటిల్ విషయంలో కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేసేశారు. కవచం అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన కాజల్, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హ‌ర్షవ‌ర్ధన్ రాణే, పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ పతాకంపై నవీన్ సొంటినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

దీంతో పాటు సాయి శ్రీనివాస్ ఖాతాలో మరికొన్ని సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో చేస్తూనే రమేష్ వర్మ కథ, మరో కొత్త డైరెక్టర్ కథను ఒకే చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి పెద్ద గ్యాప్ తీసుకోకుండా సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడన్నమాట.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here