టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఖరారు – ముఖ్య అతిథిగా స్టార్ హీరో

Allu Arjun Chief Guest For Taxiwaala Pre Release Event,Taxiwaala Gears Up For a Grand Release,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Taxiwaala Movie Latest Updates,Taxiwaala Pre Release Event Updates,Taxiwaala Pre Release Event Grand Release,Vijay Deverakonda Movie Taxiwaala Pre Release Event,Taxiwaala Pre Release Event Details,Taxiwaala Pre Release Event Latest News,Allu Arjun Special Guest For Taxiwaala Pre Release Event
Allu Arjun Chief Guest for Taxiwaala Pre Release Event

ఎట్టకేలకు టాక్సీవాలా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో రావాల్సిన సినిమా గ్రాఫిక్స్ పనులు లేట్ అవ్వడంతో సినిమా రిలీజ్ కూడా లేట్ అయింది. ముందు డిసెంబర్ 16 న రిలీజ్ చేద్దామనుకున్నా..ఆ తరువాత ఒక రోజు లేట్ తో డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కత్తెరలు వేయకుండా సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అంతేకాదు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక సినిమా రిలీజ్ టైం కూడా దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. నవంబర్ 11వ తేదీన ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎవరొస్తున్నారబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రానున్నాడు.

కాగా సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణి ఓ కీలక పాత్రలో నటించనుంది. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఊరించి ఊరించి ఇప్పుడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఏం చేస్తుందో? విజయ్ ఖాతాలో మరో హిట్టు పడుతుందో?లేదో? చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here