రిలీజ్ కు సిద్దమవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘47డేస్’

47 Days Movie Gearing up for a Release,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,47 Days Movie Latest News,47 Days Telugu Movie Latest Updates,47 Days Movie Release Date,#47DaysMovie,47 Days Telugu Movie Gearing up for a Release
47 Days Movie Gearing up for a Release

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో 47డేస్ (ద మిస్టరీ అన్ ఫోల్డ్స్) అనే ట్యాగ్ లైన్ తో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈసినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే, శ్రీధర్ మక్కువ.. విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వైజాగ్ , అరకు, గోవా, హైదారాబాద్ షూటింగ్ జరుపుకుంటుండగా.. షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ..తెలుగు ప్రేక్షకులకు ‘47డేస్’చిత్రం సరికొత్త అనుభూతి ఇస్తుందని.. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని చెబుతుంది చిత్ర యూనిట్. కంప్లీట్ టెక్నిషియన్స్ సినిమాగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు…ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్ కు ఓవర్ సీస్ హక్కులు దక్కించుకుంది.

నటీనటులు: సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్, సత్య ప్రకాష్, రవివర్మ , శ్రీకాంత్ శర్మ ,ఇర్ఫాన్ ,ముక్తార్ ఖాన్
కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ షొంఠి
సినిమాటోగ్రఫీ : జికే
సంగీతం : రఘు కుంచే
ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్
డిజైన్స్: అనిల్ భాను
యాక్షన్: శ్రీ
పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా,
పాటలు : భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ , ప్రీతి కేశవన్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here