కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై గీతాంజలి, నిన్నుకోరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన స్టార్ రైటర్ కోన వెంకట్, సూపర్ సినిమా తో టాలీవుడ్ లో ఎంటరయి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరొందిన అనుష్క నవంబర్ 7 వ తేదీ బర్త్ డే సందర్భంగా గొప్ప మానవతావాది అనుష్క కు బర్త్ డే శుభాకాంక్షలని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కోన ఫిల్మ్ కా ర్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుష్క హీరోయిన్ గా నిర్మించనున్న సినిమా US లో ప్రారంభంకానుందని , రైటర్ గోపి మోహన్ స్క్రీన్ ప్లే, తమిళ్ హీరో మాధవన్, సుబ్బరాజు కీలక పాత్రలలో నటించనున్నారని కోన వెంకట్ ట్వీట్ చేశారు.
