తెరమీద – తెరవెనుక పంది తో పడరాని పాట్లు పడ్డ రవిబాబు

Adhugo Movie Live Updates, Adhugo Movie Plus Points, Adhugo Movie Public Response, Adhugo Movie Public Talk, Adhugo Movie Review, Adhugo Movie Review and Rating, Adhugo Movie Story, Adhugo Review, Adhugo Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Adhugo Movie Review

కమెడియన్ కమ్ విలన్ గా రవిబాబు నటన విలక్షణంగా ఉంటుంది.
దర్శకుడుగా రవిబాబు ఎన్నుకునే కాన్సెప్ట్ లు , టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. మొత్తం మీద టాలీవుడ్ లో నటుడుగానూ , దర్శకుడిగానూ రవిబాబుకు ఒక ప్రత్యేక తరహా ప్లేస్మెంట్ ఉంది. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యూవర్షిప్ ఉంది. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ లోని ప్రముఖ దర్శకులు చాలామంది రవిబాబు టేకింగ్ ను, టెక్నికల్ గా ఆయన నాలెడ్జ్ ని అభినందిస్తుంటారు. రెగ్యులర్ జోనర్ ఫిలింస్ కు భిన్నంగా వెళ్లే రవిబాబు ఇప్పుడు “అదుగో” అంటూ చేతిలో ఒక పంది పిల్లను పట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్క్రిప్ట్ పరంగా,3 డీ యానిమేషన్ పరంగా చాలా రిస్క్ తో కూడుకున్న ఈ సినిమాను రవిబాబు ఎలా హ్యాండిల్ చేశారో రివ్యూలో చూద్దాం.

ఒక తండ్రి పంది తన కొడుకు పందిని రోడ్డు దాటి వెళ్ళదు అని హెచ్చరిస్తుంది. ఏం ఎందుకు వెళ్ళద్దు? వెళ్తే ఏమౌవుద్ది ? అని అడుగుద్ధి.అప్పుడు ఆ తండ్రి పంది పిల్ల పందికి చెప్పే ఫ్లాష్ బ్యాకే “అదుగో” కథ.

చంటి అనే పిల్లోడు అల్లారుముద్దుగా పెంచుకునే బంటి అనే పంది పిల్లను ఒక రౌడీ గ్యాంగ్ బలవంతంగా తీసుకెళ్తుంది. సిటీలో ఆడే యానిమల్ రేసుల కోసం ఆ పంది పిల్లను తీసుకువెళ్తారు రౌడీ బ్యాచ్. ఈ పిల్లాడు ఆ పంది పిల్ల కోసం వాళ్ల వెనుక పరుగెత్తుతాడు. ఆ రౌడీల దగ్గర ఆపోజిట్ గ్యాంగ్ కి సంబంధించిన కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్ తాలూకు కంప్యూటర్ చిప్ ఉంటుంది. అవతల బ్యాచి రౌడీలు వచ్చేసరికి ఆ చిప్ ను అరటిపండులో దూర్చి కారు వెనక సీట్లోకి విసిరేస్తాడు. ఆ రౌడీలు వెళ్లిపోయాక ఆ చిప్ కోసం చూస్తే అరటి పండు తో సహా చిప్ ను కూడా మింగేసి ఉంటుంది పందిపిల్ల. ఆ విషయం తెలిసి ఇప్పుడు ఆ పంది పిల్ల కోసం నాలుగు రౌడీ గ్యాంగ్ లు వేట ప్రారంభిస్తాయి. యానిమల్ రేసుల కోసం రెండు గ్యాంగులు , పంది పిల్ల కడుపులో ఉన్న కంప్యూటర్ చిప్ కోసం మరో రెండు గ్యాంగులు బంటీ ని వేటాడుతూ ఉంటాయి. ఈ గ్యాంగుల మధ్య అనుకోకుండా ఒక లవర్స్ జంట, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇరుక్కుంటారు.
వీళ్లందరి కోసం పోలీసుల వేట ప్రారంభం అవుతుంది.

చివరికి పందిపిల్ల ఎవరికి దొరికింది? దాని కడుపులోని కంప్యూటర్ చిప్ ఏమైంది? తెలుసుకోవాలంటే “అదుగో” పంది పిల్ల చూడండి. పందిపిల్ల ఎక్కడ ఎక్కడ అని వెతుకుతూ అది కనిపించగానే “అదుగో” అని దాని వెంట పరుగులు పెట్టడమే “అదుగో ” సినిమా టైటిల్ జస్టిఫికేషన్.

ఇండియన్ ఫిలిమ్స్ లో మొట్టమొదటిసారిగా త్రీడీ లైవ్ యానిమేషన్ లో చిత్రీకరించిన “అదుగో” ఎత్తుగడ చాలా బాగుంది. టైటిల్ కార్డ్స్ దగ్గర్నుంచే తన ప్రత్యేకతను చూపించారు రవిబాబు. హీరో అభి (అభిషేక్ వర్మ) హీరోయిన్ రాజీ ( నభా నటేష్ ) ల లవ్ ట్రాక్ ను డిఫరెంట్ గా డీల్ చేశారు రవిబాబు.

అయితే తీసుకున్న పాయింట్ లో కొత్తదనం ఉన్నప్పటికీ సన్నివేశాలు కొంత రొటిన్ గా అనిపించాయి. త్రీడీ యానిమేషన్ వర్క్ చాలా బాగున్నప్పటికీ సెల్ ఫోన్స్ లోనే అద్భుతమైన గ్రాఫిక్స్, యానిమేషన్ వండర్స్ చూస్తున్న ఈ జనరేషన్ పిల్లలను అదుగో లోని 3డీ ఆనిమేషన్ పెద్దంతగా ఆకట్టుకోక పోవచ్చు. మ్యూజిక్ , ఇతర టెక్నికల్ అంశాలు, మేకింగ్ వాల్యూస్ up to the mark ఉన్నాయి. మొత్తానికి తెరమీద, తెర వెనుక పంది పిల్లతో పడరాని పాట్లు పడుతూ రవిబాబు తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు. ఆర్థికంగా మానసికంగా ఇంత రిస్కీ ప్రాజెక్ట్ చేయటం అవసరమా అనిపిస్తుంది. అలాగే స్క్రిప్ట్ పరంగా కూడా రవిబాబు చాలా కాంప్లికేటెడ్ ఛాలెంజ్ ని టేకప్ చేశారు అనిపిస్తుంది. It’s really a brain squeezing job to the director .

ఏది ఏమైనా రొటీన్ కు భిన్నంగా వెళ్లి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ప్రజెంట్ చేయాలి అన్న రవి బాబు ప్రయత్నాన్ని, పట్టుదలను అభినందించాలి. ఈ ప్రయత్నం కమర్షియల్ గా ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

 

 

అదుగో మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here