మహేష్ కోసం సుకుమార్ మరో కొత్త స్టోరీ – కారణం అదేనట!

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే గత కొద్ది రోజులుగా న్యూయార్క్ షెడ్యూల్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అక్కడ షూటింగ్ ముగించుకొని ఈ టీమ్ఇండియా తిరిగొచ్చింది. తరువాత షెడ్యూల్ హైదరబాద్ లో జరగనుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత మహేష్ 26 వ సినిమా సుకుమార్ తో ఉన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రజకర్ల బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో స్టోరీ ఉంటుందని కూడా వార్తలు జోరుగా సాగాయి. అయితే ఇప్పుడు మరో సంచలనమైన వార్త బయటకొచ్చింది. ఇలాంటి స్టోరీలు చేయడానికి మహేష్ ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తోంది. ఆ విషయమే సుకుమార్ కు కూడా చెప్పినట్టు సమాచారం.

ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమా వస్తుంది…మళ్లీ అలాంటి జోనర్ లోనే తీస్తే ఓవర్ లోడ్ అయిపోతుందని… అంతేకాదు ఇలాంటి సినిమాలు చేయాలంటే తల నుండి బొటనవేలు వరకూ ట్రాన్స్ఫామేషన్ ఉండాలని.. మహేష్ అన్నాడట. దీనిపై సుకుమార్ కూ మహేష్ కూ చాలాసేపు డిస్కషనే జరిగిందట. కానీ మహేష్ మాత్రం ఈ స్టోరీని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో సుకుమార్ మళ్లీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. మహేష్ బాబు సెన్సిబిలిటీకి తగినట్టుగా స్టోరీ రాసే పనిలో పడ్డాడట. మరి ఈ సారైనా సుక్కు స్క్రిప్ట్ వర్కవుట్ అవుతుందో?లేదో?చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here