రామ్ చరణ్ #RC12 టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్

Ram Charan #RC12 Title And First Look Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Telugu Cinema Updates,RC12 Movie Updates,RC12 Movie Title And First Look,Ram Charan New Movie Title And First Look,Mega Power star Ram Charan Latest Movie Title And First Look,RC12 Movie Latest News,RC12 Title And First Look Released
Ram Charan #RC12 Title And First Look Out Now

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా #RC12 గానే ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు ముగిసిపోయింది. కానీ మెగా అభిమానులకు మాత్రం ఇన్ని రోజుల నిరాశే ఎదురైంది. ఈసినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇన్ని రోజుల తరువాత వారి ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఈరోజు తాజాగా ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక మాస్, రఫ్ లుక్ లో ఉన్న చరణ్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక టైటిల్ కూడా గతంలో అనుకున్న వినయ విధేయ రామ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఇక నవంబర్ 9 ఉదయం 10.25 గంటలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్టు పోస్టర్ లో తెలిపారు.

కాగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా.. ఆర్యన్ రాజేష్, స్నేహ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న…ఈ సినిమాను సంక్రాతికి ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు.

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here