సైలెంట్ గా పనికానిచ్చేస్తున్న రాజమౌళి తనయుడు కార్తికేయ

Rajamouli son Karthikeya Debut in Tollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Rajamouli son Karthikeya Movie Latest News,Tollywood Director Rajamouli son Karthikeya Debut in Tollywood Movies,Rajamouli son Karthikeya Debut in Telugu Movies,Rajamouli son Karthikeya Latest Film Updates
Rajamouli son Karthikeya Debut in Tollywood

రాజమౌళి తనయుడు కార్తికేయ కు ఇటీవల నిశ్చితార్ధమై పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు అన్న కూతురితో కార్తికేయకు నిశ్చితార్ధం జరిగిన సంగతి విదితమే. ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ…ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… కార్తికేయ నిర్మాతగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న టాక్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి కార్తికేయ రాజమౌళి చాలా సినిమాలకు పనిచేశాడు. మగధీర సినిమా నుండి రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు తానే అసిస్టెంట్ గా కూడా వ్యవహరించాడు. బిజినెస్ లలో కూడా తనకు అనుభవం ఉంది. అంతేకాదు.. ఇటీవలే నాగచైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ సినిమాకు నిర్మాణ వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు తానే స్వయంగా నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మిస్తున్నాడట. రాజమౌళి దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న ఓ అసోసియేట్ డైరెక్టర్ ను పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నాడట. అంతేనా..ఈ సినిమాకు ‘ఆకాశవాణి’ అనే పేరుని కూడా ఫైనల్ చేశారట.

ఇక సినిమా మొత్తం పూర్తయిన తరువాత వివరాలు బయటకి చెప్పాలని.. సినిమా కాస్టింగ్ దగ్గర నుండి అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా..బయటకు రాకుండా చూసుకుంటున్నాడట. మరి దీనిపై ఇంకా సమాచారం తెలియాలంటే చూస్తూనే ఉండండి దతెలుగుఫిలింనగర్.కామ్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here