అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం – కేరళ ప్రభుత్వం నుండి ఆహ్వానం

Allu Arjun Latest News, Allu Arjun Special Guest For Nehru Trophy Boat Race, Kerala Government Invites Allu Arjun for Nehru Trophy Boat Race, Kerala Government Invites Allu Arjun Guest For Nehru Trophy Boat Race, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Kerala Government Invites Allu Arjun for Nehru Trophy Boat Race

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే బన్నీకి తెలుగు అభిమానులతో పాటు కేరళలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలు అక్కడ కూడా మంచి కలెక్షనను రాబడతాయి. ఈ నేపథ్యంలోనే కేరళ నుండి బన్నీకి ఓ అరుదైన గౌరవం దక్కింది.

కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావ్వాల్సిందిగా స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ పోటీలు ఈ నెల 10న అలప్పుల సమీపంలోని పున్నంద సరస్సులో జరగనున్నాయి. ఈ విషయాన్ని బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఇక కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై బన్నీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాదు ఈ గౌరవం పొందిన తొలి టాలీవుడ్ హీరో బన్నీనే కావడం విశేషం. మరి, మన తెలుగు హీరో కేరళ ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా వెళ్లడం గొప్ప విషయమే కదా.

కాగా ఈ ఏడాది ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’తో వచ్చిన బన్నీ.. తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here