భైరవగీత పై వర్మ ప్రశంసలు – నన్ను సర్ ప్రైజ్ చేశాడు

Bhairava Geetha Movie Latest News, Bhairava Geetha Packed with Talented Cast and Crew, Bhairava Geetha Telugu Movie Updates, Latest Telugu Movies 2018, Ram Gopal Varma About Bhairava Geetha Movie, Ram Gopal Varma Latest Movie Bhairava Geetha, RGV Heaps Praises on Bhairava Geetha Director Siddhartha Thatolu, RGV Praises Director Siddhartha Thatolu, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
RGV Heaps Praises on Bhairava Geetha Director Siddhartha Thatolu

ఆర్జీవీ సమర్పణలో వర్మ శిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో భైరవగీత సినిమా తెరకెక్కుతన్న సంగతి తెలిసిందే. వర్మ పేరుతోనే ఈసినిమాకు రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. దానికి తోడు అతని శిష్యుడు డైరెక్టర్ అంటే ఏలా ఉంటుంది. అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఇప్పటికే ఆర్ఎక్స్ 100 టేకింగ్ తో వర్మ శిష్యుడనిపించుకున్నాడు విజయ్ భూపతి. ఆ సినిమా హిట్ తో ఇప్పుడు సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మరి రాంగోపాల్ వర్మ శిష్యులు అవడం వల్ల టేకింగ్ అలా ఉంటుందో….లేక అలాంటి లక్షణాలు ఉన్నవాళ్లే వర్మ శిష్యులు అవుతారో తెలియదు కానీ.. వారి సినిమా టేకింగ్ చేసే విధానం కూడా వర్మలానే ఉంటుంది. ఆయన శిష్యులు కూడాా ఆయన స్టైల్ నే అనుకరిస్తూ..అనుసరిస్తుంటారు. ఒక్కోసారి..ఆయన పర్యవేక్షణలో తీసిన సినిమాలు అయితే వర్మే డైరక్ట్ చేసి, శిష్యుడు పేరు వేసేరేమో అనే సందేహం కూడా వస్తూంటుంది.

భైరవగీత సినిమాలో కూడా వర్మ మార్క్ కనిపిస్తోంది. ఈ విషయం ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ను చూస్తే అర్థమైపోయింది. అంతేకాదు చాలా చిన్న వయసైన సిద్దార్థ్ తాతోలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చూసి వర్మ సిద్దార్ధ్ పై ఓ రేంజ్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న ఆయన సిద్దార్ధ్ ను పొగడ్తలతో ముంచెత్తారు.

నేను కిల్లింగ్ వీరప్పన్ సినిమా షూటింగ్ లో తీసినప్పుడు అతనిని కలిశాను.. అతని వర్క్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది.. అందుకే తనతో వెంటనే ముంబయి వచ్చి కలవమన్నాను. నేను ఓ వెబ్ సిరీస్ తీసినిప్పుడు కూడా తన ఇన్వాల్వ్ మెంట్, సజెషన్స్, చెప్పడం నన్ను ఎట్రాక్ట్ చేసింది…అందుకే ఓ డిఫరెంట్ మూవీ తీయమని చెప్పానన్నారు. కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉండేది..తను చేస్తాడా..పెద్ద యాక్టర్స్ ను లీడ్ చేయగలడా అన్న డౌట్ ఉండేది.. కానీ తను చేయగలనని చెప్పాడు..ఆరోజు నుండి ఈరోజు వరకూ వెనుతిరిగి చూడలేదని తెలిపారు. నాకు ఈ సినిమా స్క్రీప్ట్ ను చదివినప్పుడు ఈ సినిమా గురించి ఓ ఐడియా ఉంది..కానీ సిద్దార్ధ్ నన్ను సర్ ప్రైజ్ చేశాడు.. తన దగ్గరనుండి నేను చాలా నేర్చుకున్నాను.. నేను ఈసినిమా తీసినా కూడా ఇలా తీసిఉండే వాడిని కాదేమో అని సిద్దార్ధ్ పై ప్రశంసలు కురిపించారు.

ఇంక ఈమధ్య వస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ..నాకు డాక్యుమెంటరీ మూవీస్ అంటే ఇష్టం.. నేను సినిమాను స్టోరీ ఎలా ఉందా అని చూడను.. సినిమా తీసే విధానాన్ని బట్టి చూస్తాను.. ఏదో రెగ్యులర్ వ్యూవర్ లాగ చూడను..అందుకే సినిమాలో ఇట్రస్టింగ్ థింగ్ లేకపోతే చూడను అని తెల్చి చెప్పారు. అంతేకాదు భైరవగీత అటు స్టోరీ..ఇటు మేకింగ్ రెండూ కలిసిన సినిమా అని అన్నారు. మరి వర్మ అయితే సిద్దార్ధ్ కు ఫిదా అయిపోయారు.. మరి సిద్దార్థ్ ఆ అంచనాలు రీచ్ అవుతాడో? లేదో? చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here