దేవ్ మూవీ టీజర్ రిలీజ్

Dev Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2018,Latest Telugu Movie Teasers,Telugu Cinema Updates,Dev Movie Updates,Dev Telugu Movie Latest News,Dev Teaser,Dev Telugu Movie Teaser,Dev Official Teaser,#DevTeaser,Hero Karthi And Rakul Preet Dev Teaser
Dev Movie Teaser Out Now

ఖాకీ సినిమాతో అలరించిన హీరో కార్తి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంట మరోసారి జోడీ కట్టింది. రజత్ రవి శంకర్ దర్శకత్వంలో యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల కాగాా ఇందులో చేతిలో హెల్మెట్‌ పట్టుకుని స్పోర్ట్స్‌ బైక్‌ వద్ద కార్తి నిలబడిన పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. తన అభిమాన క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్ఫూర్తితోనే ఈ సినిమాకు ‘దేవ్‌’ టైటిల్‌ను పెట్టినట్లు దర్శకుడు రజత్‌ రవి శంకర్ ఇటీవలే తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా రజత్‌ రవి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఖాకీ చిత్రం తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాకి హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here