రిలీజయిన ఏ ఆర్ రెహమాన్ బయోగ్రఫీ

AR Rahman Biography Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Music Director AR Rahman Latest Updates,Music Director AR Rahman Biography,AR Rahman Biography Latest News,AR Rahman Lifestyle,AR Rahman Biography as Notes of Dream,AR Rahman About His Biography Notes of Dream
AR Rahman Biography Out Now

తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్, బ్లాక్ బస్టర్ రోజా మూవీ తో తమిళ చిత్ర పరిశ్రమకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయ్యారు. మొదటి చిత్రం తోనే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పలు చిత్రాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రతిష్టాత్మక కలైమామణి, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్న రెహమాన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 6నేషనల్ అవార్డ్స్, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 17ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ అందుకున్న భారతీయ సంగీత దర్శకుడి గా రికార్డ్ క్రియేట్ చేశారు.

ఏ ఆర్ రెహమాన్ జీవితం ఆధారంగా రైటర్ కృష్ణ త్రిలోక్ రచించిన రెహమాన్ బయోగ్రఫీ “నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్ :ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ నవంబర్ 3వ తేదీ ల్యాండ్ మార్క్ , పెంగ్విన్ ర్యాన్డమ్ సౌజన్యంతో ముంబయి లో రిలీజయింది. తన బయోగ్రఫీ రిలీజ్ సమయం లో రెహమాన్ మాట్లాడుతూ … తనకు 25 సంవత్సరాలు వచ్చేవరకూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వెంటాడుతుండేవని, తన తండ్రి మరణం తన భయాన్ని పోగొట్టిందని, తన తండ్రి మరణించేవరకూ పని చేస్తూఉన్నానని,35సినిమాలకుపనిచేసే అవకాశం కలిగితే 2సినిమాలకు మాత్రమే పనిచేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిందనీ, రోజా సినిమాతోసంగీతదర్శకుడిగా మారానని, అప్పుడే తన కుటుంబం ఇస్లాం మతం లోకి మారిందని, తన అసలు పేరు దిలీప్ కుమార్ అని, ఆపేరంటే తనకు ఇష్టం లేదని, తన వ్యక్తిత్వానికి ఆ పేరు సూట్ కాదని అనిపించిందని, మనసు చెప్పేది వినాలని నమ్ముతానని, నాలో మార్పు రావడానికి సంగీతమే కారణం అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here