విజయ్ సర్కార్ కు మరో ప్రాబ్లమ్ – నో పర్మిషన్

No Special Shows for Vijay Sarkar,Sarkar Movie Brings in Bad News For Fans,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film UPdates,Latest Telugu Movies 2018,Sarkar Movie Latest News,Vijay Sarkar Movie Brings in Bad News For Fans,Sarkar Movie Brings Bad News For Vijay Fans,Sarkar Movie Updates,Vijay Latest Movie Sarkar Updates
No Special Shows for Vijay Sarkar

తమిళ స్టార్ హీరో విజయ్, స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఎంత క్రేజ్ పెరిగిందో..ఎన్ని అంచనాలు ఏర్పడ్డాయో..అలాగే సినిమాకు తలనొప్పులు కూడా అలానే వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా కథ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత ఈ కథ నాదే అంటూ కోర్టులో కేసు వేయగా..ఎలాగొలా అది సెటిల్ అయింది.

ఇప్పుడు ఈ సినిమాకు మరో ప్రాబ్లమ్ వచ్చింది. ఈ సినిమా స్పెషల్ షోస్, అదనపు షోలని ప్రదర్శించడంపై కోర్టు నిషేధం విధించింది. సామాజిక కార్యకర్త దేవరాజ్ దీనిపై కోర్టులో కేసు వేయగా..కోర్టు సర్కార్ సినిమాకు స్పెషల్ షోస్ కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అభిమానులకు నిరాశ ఎదురైంది. మరి ఇంకో మూడురోజుల్లో రిలీజ్ ఉంది…పాపం ఇంకేం అడ్డంకులు వస్తాయో ఈ సినిమాకు..

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మిశరత్ కుమార్ ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కత్తి, తుపాకి సినిమాలు ఘన విజయం సాధించాయి..ఇప్పుడు విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ అందుకుంటారో..? లేదో..? తెలియాలంటే నవంబర్ 6 వరకు వెయిట్ చేయాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here