నో డౌట్ మాతోనే మహేష్ 26 సినిమా.. ఆ డైరెక్టర్ తోనే

Mythri Movie Makers Confirms Mahesh Babu Movie with Sukumar,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,#MaheshBabu26,#MythriMovieMakers,Director Sukumar New Movie With Mahesh Babu,Super Star Mahesh Babu Movies Latest News,Mahesh Babu Next Film with Sukumar,Super Star Mahesh Babu Upcoming Project Details
Mythri Movie Makers Confirms Mahesh Babu Movie with

ప్రస్తుతం మహేష్ బాబు 25 సిల్వర్ జూబ్లి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ టీమ్ ఇండియాకు తిరిగి రానుంది. తరువాత షెడ్యూల్ ఇక్కడే హైదరాబాద్ లో జరుపుకోనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత మహేష్ 26 సినిమా సుకుమార్ తో ఉంటుందన్న వార్తలు గత కొద్దికాలంగా వినిపిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పటివరకూ దీనిపై ఎవరూ అధికారికంగా చెప్పలేదు కానీ.. తాజాగా ఈ సినిమా క్లారిటీ ఇచ్చారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.

ఈ సినిమాపై ఉన్న అనుమానాలు తీర్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. మహేష్ తమ సినిమానే ముందుగా చేస్తాడన్నారు. సుకుమార్‌తో అతడి సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పక్కాగా మొదలవుతుందని వారు చెప్పారు. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు.. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాం.. ఓ ఫ్రెష్ ఫేస్ అయితే మహేష్ పక్కన బావుంటుందని చూస్తున్నామని తెలిపారు. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటం.. రజాకార్ల నేపథ్యంలో ఈ కథ ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని వాళ్లు ఖండించారు. మరి ఇదే నిజమైతే మహేష్ తో మైత్రీ మూవీ మేకర్స్ కు.. అదే విధంగా 1.నేనొక్కడినే సినిమా తరువాత సుకుమార్ కు కూడా ఇది రెండో సినిమా అవుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్ డేట్స్ కావాలంటే వెయిట్ చేయాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here