ఏడు చేపల కథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Yedu Chepala Katha Teaser Gets a Release Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Yedu Chepala Katha Teaser Release Date Fixed,Yedu Chepala Katha Teaser Release Date Locked,Yedu Chepala Katha Teaser Release Date Revealed,Yedu Chepala Katha Teaser Release Date,Yedu Chepala Katha Teaser Release Date Confirmed
Yedu Chepala Katha Teaser Gets a Release Date

ప్రస్తుతం మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు ధైర్యంగా నోరు విప్పి తమకు జరిగిన సంఘటనల గురించి చెబుతున్నారు. ఇక ఈ ఉద్యమంలో భాగంగా కొంత మంది పేర్లు బయటకు రావడం కూడా ఆశ్చర్యానికి గురుచేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇలాంటి నేపథ్యంతోనే ఓ సినిమా రాబోతుంది. ఏడు చేపల కథ అనే డిఫరెంట్ టైటిల్ తో టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు. అసలు మీటూ కు టెమ్ట్ రవికి ఉన్న సంబంధం ఏంటి…? టెమ్ట్ రవి కి మీటూ అని చెప్పిన హీరోయిన్ ఎవ‌రు? ఈ విషయాలు తెలియాలంటే మాత్రం టీజర్ వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. రేపు సాయంత్రం అంటే అక్టోబర్ 26న సాయంత్రం 5.01 నిమిషాల‌కి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా పూర్తి అడల్డ్ కామెడీ జోనర్ లో కొత్త వారితో నిర్మిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకట్టుకుంది. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు. కవి శంకర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. “ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు… ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాల చూపెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున మీటూ అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను “ఏడు చేపల కథ” చిత్రంతో పరిచయం చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది. దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు..త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. మరి చూద్దాం..ఈ మీటూ ఎలా ఉంటుందో…

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here