అదుగో రిలీజ్ డేట్ ఫిక్స్

Ravi Babu Adhugo All Set for Release,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Adhugo Movie Release Date Fixed,Ravi Babu Adhugo Movie Release Date Confirmed,Adhugo Movie Release Date Locked,Adhugo Movie Release Date Fixed,Adhugo Movie Latest Updates,Ravi Babu Latest Movie Adhugo All Set for Release
Ravi Babu Adhugo All Set for Release

విభిన్నమైన పాత్రలు చేస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు… అటు దర్శకుడిగానూ విభిన్నమైన కథనాలతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఆ విషయం ఆయన తీసిన సినిమాలు చూస్తేనే అర్ధమైపోతుంది. ఇప్పుడు తాజాగా మరో విభిన్న కథాంశంతో ముందుకొస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పంది పిల్లతో రవిబాబు ఎన్నో ఫీట్లు చేయించనున్నాడు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో ఈ సినిమా రూపొందుతుంది. టాలీవుడ్లో పంది పిల్లపై సినిమా రావడం కూడా ఇదే తొలిసారి.

ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు అందరి దృష్టి సినిమాపై పడింది. 3డి యానిమేషన్ సీన్లు, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్ధమైంది. అంతేకాదు ఈ సినిమా కోసం రవిబాబు ఏకంగా పంది పిల్లల్నేపెంచుకుంటున్నారంటేనే ఆయన ఈ సినిమా విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. నవంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవిబాబుతో పాటు అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ఇతర కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. తెలుగులో అదుగో పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా.. ఇతర భాషల్లో బంటీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మరి పందిపిల్ల చేసే చిలిపి పనులు, విన్యాసాలు చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here