2.0 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Rajinikanth 2.0 Trailer Getting Ready for Release,2.0 Trailer Release Date Revealed,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,2.0 Trailer Release Date Fixed,2.0 Trailer Release Date Confirmed,2.0 Trailer Release Date Locked,Rajinikanth 2.0 Trailer Latest Updates,2.0 Trailer Release Date Announced
Rajinikanth 2.0 Trailer Getting Ready for Release

భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో…తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2.0 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రోబో అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. అప్పట్లోనే విజువల్ వండర్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి అంతకు మించి అన్నట్టు.. విజువల్స్ తో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను చూస్తే విజువల్ ఫీస్టే అందించనున్నట్టు అర్ధమైపోయింది. వినాయక చవితికి విడుదలైన టీజర్.. 24 గంటల్లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయి రికార్డు సృష్టించింది. 3డి ఫార్మాట్ లో రూపొందిన 2.0 సినిమాను దర్శకుడు శంకర్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. దీంతో మరోసారి చిట్టి మాయ చేయబోతున్నాడంటూ సినిమా ఎప్పుడొస్తుందా…విజువల్ ఫీస్ట్ ను ఎప్పుడు ఆస్వాదిద్దామా.. అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 3న ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. టీజర్ లోనే విజువల్స్ తో అందరినీ ఆకట్టుకున్న శంకర్.. ట్రైలర్ తో ఏం మాయ చేస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లో శంకర్ మార్క్ సీన్స్ తో పాటు హాలీవుడ్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో రజినీకాంత్ సరసన అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ కూడా చివరి దశకు వచ్చేశాయి. మరికొన్ని రోజుల్లో ఫైనల్ అవుట్ ఫుట్ ని కూడా చెక్ చేయనున్నారట. అన్ని పనులు త్వరలో పూర్తిచేసి… దీపావళి కానుకగా నవంబర్ 29న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here