ఎన్టీఆర్- చెర్రీ లకు పెద్ద మొత్తాలా..? కొంత లాభాలా ?

#RRR Movie Latest Updates, #RRR Movie Remuneration updates, Jr NTR and Ram Charan Remunerations for RRR, Latest Telugu Movies 2018, Rajamouli RRR Movie Updates, Remuneration For Jr NTR and Ram Charan Combination Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Jr NTR and Ram Charan Remunerations for RRR

ఒక స్టార్ కు ఉన్న సక్సెస్ రేటు, ఇమేజ్ , స్టార్ డమ్ , డిమాండ్ లను బట్టి పారితోషికం ఉంటుంది. ఒక స్టార్ హీరో రెమ్యూనరేషన్ సినిమా మొత్తం కాస్ట్ లో 25 నుండి 30 శాతం వరకు ఉండవచ్చు.
అయితే కొన్ని సందర్భాలలో స్టార్స్ సక్సెస్ రేటు, డిమాండ్ లు అనూహ్యంగా పెరిగి పోయిన సందర్భంలో వారు ఎంత అడగొచ్చు నిర్మాతలు ఎంత ఇవ్వవచ్చు అనే విషయం పట్ల స్పష్టత ఏర్పడదు. ఇలాంటి సందర్భాల నుండి పుట్టినదే పర్సంటేజ్ సిస్టం .
ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చి తరువాత వచ్చే టేబుల్ ప్రాఫిట్ లో కొంత పర్సంటేజ్ ని హీరో రెమ్యూనరేషన్ కింద ఇచ్చే పద్ధతిని అనుసరిస్తుంటారు. అయితే సదరు నిర్మాతకు హీరోకు మధ్య అరమరికలు లేని అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఇలాంటి ఒప్పందాలు సజావుగా సాగుతాయి.

ఇలాంటి ఉభయ సౌలభ్య మైన “మోడ్ ఆఫ్ పేమెంట్” ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ దీనిని ఎక్కువగా ఫాలో అయింది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. నిర్మాణ సమయంలో నిర్మాతకు ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగానే రెమ్యూనరేషన్ రూపంలో డబ్బు తీసుకోకుండా తన పారితోషికం కింద నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకునేవారు చిరంజీవి.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే – దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ” RRR ” చిత్రం ఈ రోజున టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది.

దర్శకుడుగా రాజమౌళి, హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ , నిర్మాతగా దానయ్య అందరూ “పీక్స్ అఫ్ సక్సెస్” లో ఉండటంతో ఈ సినిమా క్రేజ్ ఏ పేరామీటర్ కు అందటం లేదు.
ఈ నలుగురు “ద బెస్ట్ ఆఫ్ దెయిర్ కెరీర్” పొజిషన్ లో ఉన్నారు.

ఇలాంటి క్రేజీ మూమెంట్లో ఈ ప్రాజెక్టు హీరోలైన “ఎన్టీఆర్ – రామ్ చరణ్ “ల పారితోషికం ఎంత అన్న టాపిక్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ సినిమాకు వీళ్లిద్దరూ రెమ్యూనరేషన్ రూపంలో ఏమీ డిమాండ్ చేయటం లేదనీ సినిమా లాభాల్లో పర్సంటేజ్ తీసుకోవటానికే ఆసక్తి చూపుతున్నారని ఒక వర్గం అంటుంటే… కాదు రెమ్యునరేషనే భారీ స్థాయిలో తీసుకుంటున్నారని కొందరు అంటున్నారు.

అయితే ఇవన్నీ ఊహాజనితమైన విషయాలే … ప్రస్తుత దశలో అప్రస్తుతాలు కూడా. మల్టీస్టారర్స్ పేరుమీద ఏవేవో కాంబినేషన్స్ వస్తున్న తరుణంలో మల్టీస్టారర్ అనే పదానికి నిజమైన నిర్వచనంలా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.
అయినా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి , రంగస్థలం లాంటి
ఫినామినల్ హిట్ తరువాత రామ్ చరణ్, అరవింద సమేత వీర రాఘవ వంటి బాంబింగ్ హిట్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విషయంలో success is primary and money is secondary అవుతుందే తప్ప మనీ మేటర్స్ అసలు మ్యాటరే కాదు.

కాబట్టి మీడియా ఇలాంటి అప్రస్తుత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒరిజినల్ అప్డేట్స్ ఇస్తే అభిమానులు సంతోషిస్తారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here