ఎన్టీఆర్ గురించి బాలయ్య పలికే బంగారమాయెనా !?

Jr NTR Upcoming Movies News, Latest Telugu Movies 2018, Nandamuri Balakrishna About Jr NTR, Nandamuri Balakrishna Comments On Jr NTR, Nandamuri Balakrishna Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Why Nandamuri Balakrishna Didn’t Speak about about Jr NTR
Why Nandamuri Balakrishna Didn't Speak about about Jr NTR

మొన్న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన అరవింద సమేత వీర రాఘవ గ్రాండ్ సక్సెస్ మీట్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరు కావడం నందమూరి అభిమానులందరినీ ఆనందంలో ముంచెత్తింది. బాలకృష్ణ – ఎన్టీఆర్ లను ఒకే వేదిక మీద చూడాలన్న నందమూరి అభిమానుల చిరకాల కోరిక ఆరోజు నెరవేరింది.

నందమూరి హరికృష్ణ ఆకస్మిక దుర్మరణం నేపథ్యంలో ఎన్టీఆర్కళ్యాణ్ రామ్ లను బాలకృష్ణ పరామర్శించి ఓదార్చిన సందర్భం నందమూరి అభిమానులందరికీ సానుకూల సంకేతంగా అనిపించింది. అప్పుడే అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎన్. టి. ఆర్. బయోపిక్ నిర్మాణ కార్యక్రమాలలో బిజీగా ఉన్న బాలయ్య ఆ వేడుకకు హాజరు కాలేదు. అప్పుడు రాలేకపోయినప్పటికీ సినిమా విడుదలై అద్భుత విజయాన్ని సాధిస్తున్న తరుణంలో జరిగిన విజయోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా బాలకృష్ణ రావటం అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చింది.

అయితే ఈ వేడుకలో ముఖ్యఅతిథి హోదాలో పాల్గొన్న బాలకృష్ణ తన ప్రసంగంలో చిత్ర కథానాయకుడు అయిన ఎన్టీఆర్ గురించి అభినందనపూర్వకంగా మాట్లాడుతారు అని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అరవింద సమేత వీర రాఘవ యూనిట్ మొత్తాన్ని అభినందిస్తూ ప్రసంగించిన బాలయ్య ఎన్టీఆర్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సంగీత దర్శకుడు తమన్ ను అభినందిస్తున్న సందర్భంలో ఒకే ఒక్కసారి ఎన్టీఆర్ పేరును ఉచ్చరించడం తప్ప తన సుదీర్ఘ ప్రసంగంలో బాలయ్య మరెక్కడా ఎన్టీఆర్ ప్రస్తావన తేలేదు.

తండ్రిని కోల్పోయిన సందర్భంలో గొప్ప ఊరటగా వచ్చిన ఈ విజయోత్సవ వేడుకలో అబ్బాయ్ గురించి బాబాయ్ సభాముఖంగా రెండు మాటలు మాట్లాడితే బాగుండేదని అభిమానులు, ఆహుతులు, ప్రేక్షకులు అనుకున్నారు.

ఇప్పుడు మిస్ అయినప్పటికీ ముందు ముందు అయినా ఇలాంటి సభలలో “బాబాయి అబ్బాయిలు” పరస్పర అభిమానాలను, ఆప్యాయతలను వ్యక్తం చేసుకుంటే కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులకు కూడా ఆ దృశ్యం కనుల పండువగా ఉంటుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here