మహానటి మనసులో మాట – ఎప్పటికైనా చేసి తీరతా!

Keerthy Suresh Reveals Her Desire of Directing Films,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Actress Keerthy Suresh Latest Updates,Keerthy Suresh Reveals her Dream Role,Keerthy Suresh Latest Interview News,Keerthy Suresh Dream Role as Directing the Films,Keerthy Suresh Next Project Details
Keerthy Suresh Reveals Her Desire of Directing Films

నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. నేను లోకల్ సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని… ఆ తరువాత మహానటి సినిమాతో ఏకంగా అలనాటి అందాల తార.. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మరింత చేరువైంది కీర్తి సురేష్. మహానటి సినిమా చూసి.. కీర్తి సురేష్ నటనపై అందరూ ప్రశంసలు కురింపిచారు. ఆ పాత్రకి కీర్తి సురేష్ తప్పా మరెవరూ న్యాయం చేయరేమో అన్నంత రేంజ్ లో ఒదిగిపోయింది కీర్తి సురేష్.

ఇక మహానటి సినిమా తరువాత తెలుగులో సినిమాలకు సైన్ చేయకపోయినా.. తమిళంలో మాత్రం కీర్తి సురేష్ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల సామి సినిమా, కొద్ది రోజుల క్రితమే పందెంకోడి2 సినిమా రిలీజ్ అయింది. విజ‌య్ తో క‌లిసి న‌టించిన స‌ర్కార్ దీపావ‌ళికి రిలీజ్ కానుంది.. ఇవి కాకుండా మ‌రో నాలుగు త‌మిళ మూవీలు చేతిలో ఉన్నాయి

ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. నాకు ఎప్పుడూ సినిమా డైరెక్ట్ చేయాలనే కోరిక బలంగా ఉండేదని…నాకు సమయం దొరికినప్పుడల్లా కవితలు.. స్క్రిప్ట్ రాసుకుంటాను.. ఏదో ఒకరోజు నా దర్శకత్వంలో సినిమా చేస్తానని తన మనసులో మాట బయటపెట్టింది. మొత్తానికి కీర్తి సురేష్ మాటలు వింటుంటే.. మెగా ఫోన్ పట్టుకోవాలన్న కోరిక బలంగానే ఉన్నట్టుంది. మరి డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరాలంటే ఎంత కాలం పడుతుందో.. తన దర్శకత్వంలో ఎప్పుడు సినిమా వస్తుందో.. అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here