ప్రభాస్ బిఫోర్ బాహుబలి & ఆఫ్టర్ బాహుబలి

#HappyBirthdayPrabhas, Best Movies of Prabhas, Best Performance of Prabhas, Best Performance of Rebel Star Prabhas, Latest Telugu Movies 2018, Prabhas Movies Latest News, Prabhas Movies Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, Top Movies Of Rebel Star Prabhas
Best Performance of Rebel Star Prabhas

శతాధిక చిత్రాలు చేసినా అందని అదృష్టాన్ని, దక్కని కీర్తి ప్రతిష్టలను 18 చిత్రాలతో సంపాదించుకుని ఈరోజున ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ డిజైరబుల్ స్టార్ గా వెలుగుతున్న ప్రభాస్ జన్మదినం ఈ రోజు. సంఖ్యాపరంగా ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ చాలామందికి కనీస గుర్తింపు కూడా దక్కదు. ఒక మారుమూల పల్లెటూరుకు వెళ్లి ఫోటో చూపించి ఇతను ఎవరు అని అడిగితే టక్కున గుర్తించి పేరు చెప్పగలిగినప్పుడే ఆ స్టార్ కు రూరల్ స్థాయి లో కూడా ఐడెంటిటీ వచ్చినట్టు లెక్క. అలాంటిది ప్రాంతీయ స్థాయి లోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా ఏ మారుమూల పల్లెటూరులోనైనా ఇతను “సినిమా హీరో ప్రభాస్” అని ఫోటో చూసి గుర్తుపట్టగల గుర్తింపును, ఆదరణను నేషనల్ ఐడెంటిటీని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకున్నారు ప్రభాస్. వాస్తవానికి ఇంత ఐడెంటిటీ కి కారణం బాహుబలి సిరీస్ అయినప్పటికీ అంతకుముందు ప్రభాస్ చేసిన చిత్రాలు కూడా తక్కువైనవేమీ కావు.

2002లో ఈశ్వర్ చిత్రం ద్వారా పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి స్టార్ గా ఎదిగారు. వర్షం చిత్రంతో కెరీర్లో తొలి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ 2013లో వచ్చిన మిర్చి వరకు ఇతర స్టార్స్ లాగానే ఒక రెగ్యులర్ ఫిలిం స్టార్. కానీ 2015 లో వచ్చిన బాహుబలి – ద బిగినింగ్, 2017 లో వచ్చిన బాహుబలి ద కంక్లూషన్ ప్రభాస్ దశను దిశను మార్చేసాయి.

కేవలం వ్యక్తిగతంగా ప్రభాస్ కెరీర్ నే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా ముఖచిత్రాన్నే మార్చేసింది బాహుబలి సిరీస్. బాహుబలి సిరీస్ కు ముందు ప్రపంచం దృష్టిలో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే. సినిమా పుట్టినప్పటినుండి ఇండియన్ సినిమా ముఖచిత్రంగా చలామణి అయిన హిందీ సినిమా స్థానాన్ని అతిక్రమించి, అధిగమించి ఒక ప్రాంతీయ భాషా చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించటం అరుదైన ఘనత. అలాంటి ఘనత వహించిన చిత్ర కథానాయకుడిగా ప్రభాస్ ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ స్టార్ అయ్యారు. ఈ రోజున ఇండియన్ సినిమా ట్రేడ్ లో ఏ సినిమా విజయాన్ని ప్రస్తావించాలన్నా “నాన్ బాహుబలి” అనే ప్రిఫిక్స్ వాడకుండా మాట్లాడే ప్రసక్తి లేదు. ఇంతటి ఘన విజయ చిత్ర కథానాయకుడైన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

అయితే ప్రభాస్ కెరీర్ ను “బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి” గా వర్గీకరించి విశ్లేషిస్తే ఏది గొప్ప పిరియడ్ అనిపిస్తుంది?

బాహుబలి కి ముందు కూడా ప్రభాస్ కు అద్భుత విజయాలు ఉన్నాయి. అంతకు ముందు కూడా ప్రభాస్ కు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. The most desired bachelor గా ప్రభాస్ కు యూత్ లో గొప్ప క్రేజ్ ఉంది. కాబట్టి ప్రభాస్ కు ఇప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు, గ్లామర్, వరల్డ్ వైడ్ ఐడెంటిటీ ఒక్కసారిగా ఓవర్ నైట్ వచ్చి వచ్చిపడినకావు.
బాహుబలి కి ముందు కూడా చాలా చిత్రాలలో ప్రభాస్ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారు.
సక్సెస్ పరంగా, రెవిన్యూ పరంగా, రికార్డ్స్ పరంగా అవి ఏవి బాహుబలికి సరి తూగకపోయినప్పటికీ నటన పరంగా ప్రభాస్ అంతకుముందు చిత్రాలలో కూడా “ది బెస్ట్ పర్ఫార్మెన్స్” ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఒక నటుడి విజయానికి కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ దియేటర్స్, రికార్డులు వంటివి కావు ప్రమాణాలు . నటన పరంగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వటమే ఒక నటుడి సమర్థతకు నిదర్శనం.

మరి ప్రభాస్ అలాంటి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సినిమా బాహుబలి ఒక్కటేనా..?
అంతకుముందు సినిమాలలో ప్రభాస్ యాక్టింగ్ పరంగా ది బెస్ట్ అనిపించుకోలేదా ?
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఇదే ఇవాళ్టి పోల్ గేమ్ పాయింట్.

2002లో ఈశ్వర్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ప్రభాస్ 2018 వరకు ఈ పదహారేళ్ళ ప్రస్థానంలో 18 చిత్రాలలో నటించగా వాటిలో 10 సెలెక్టెడ్ చిత్రాలను ఇక్కడ ఇస్తున్నాం .వాటిలో
“నటన పరంగా ది బెస్ట్ ఆఫ్ ప్రభాస్” ఏది అని నిర్ణయించి మీ నిర్ణయాన్నే ప్రభాస్ కు బర్త్ డే గిఫ్ట్ గా ప్రజెంట్ చేయండి.
Your voting is your Greeting కాబట్టి don’t miss to greet Prabhas ..The Rebel Star .

 

నటన పరంగా ద బెస్ట్ ఆఫ్ ప్రభాస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here