అల్లు అర్జున్ కొత్త సినిమా డైరెక్టర్ ?

Allu Arjun Next Movie Director?,Allu Arjun Upcoming Projects With the Most Talented in the Industry,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Allu Arjun Upcoming Movies,Allu Arjun New Movie Details,Allu Arjun New Movie With the Most Talented in the Industry,Stylish Star Allu Arjun Movies Latest News,Stylish Star Allu Arjun Next Movie Updates
Allu Arjun Next Movie Director?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినగానే ప్రేక్షకుల, అభిమానులలో ఉత్సాహం ఉప్పొంగుతుంది. తన నటన, డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకునే అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య రిలీజయి 6నెలలు కావస్తున్నా, ఇంకొక సినిమా ప్రారంభం కాలేదు. అల్లు అర్జున్ నటించే సినిమా గురించి అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఇష్క్, మనం వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం లో సినిమా ఓకే అనుకున్న తరుణంలో ఆ సినిమా పక్కకు వెళ్ళింది.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన జులాయి, S%సత్యమూర్తి వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ఉంటుందని సమాచారం. ఒక హిందీ సినిమా రీమేక్ లో అల్లు అర్జున్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు మారుతి, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం వంటి సక్సెస్ ఫుల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ అల్లు అర్జున్ కొత్త సినిమా కు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వం లో నటించనున్నాడో త్వరలోనే తెలియనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here