త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో హీరోలందరూ సీరియస్ కామెడియన్సే

Trivikram Heroes are Serious Comedians,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Trivikram Movies Latest News,Trivikram Movies With Serious Comedic Heroes,Director Trivikram Srinivas Movies,Trivikram Srinivas Movies Latest Updates,Aravindha sametha Movie Updates
Trivikram Heroes are Serious Comedians

ఎంటర్టైన్మెంట్ అనే పదానికి అర్థం వినోదం. అయితే వినోదం అనగానే అందరికీ స్ఫురించేది హాస్యం. హాస్యనటులు చేసేదే హాస్యం అనే భావన చాలామందిలో ఉంటుంది.అయితే వినోద మార్గాలలో హాస్యం ఒక మార్గమే తప్ప వినోదానికి ఏకైక మార్గం హాస్యం ఒక్కటే కాదు. నవరసాలలో ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు అరెస్ట్ చేయగలిగిన రసం ఏదైనా వినోదమే.అయితే హాస్య రసం ఒక్కటే వినోదదాయని అనుకునే సగటు ప్రేక్షకుడి ఆలోచనలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది.

“శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత,శాంత” అనే నవరసాలలోని ఏ రసం నుండైనా వినోదాన్ని ఆస్వాదించవచ్చు. కానీ చాలామంది దర్శకులకు, రచయితలకు , ప్రేక్షకులకు, విశ్లేషకుల దృష్టిలో వినోదం అంటే హాస్యం మాత్రమే అనుకోవటం కొంచెం ఆశ్చర్యంగానూ, విడ్డూరంగా కూడా అనిపిస్తుంది.

అందుకే తమ సినిమాలలో హాస్యం కోసం ప్రత్యేకమైన కామెడీ ట్రాకులు పెట్టి నానా పాట్లు పడుతూ ఫీట్లు చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే వినోదం అంటే కొందరు హాస్య నటీనటులు తెరమీద చేసే వికార విన్యాసాలు కాదు…. వినోదం అంటే నవరసాలలోని ఏ రసం నుండైనా ఉద్భవించే ఒకానొక రసజ్ఞ భావన .

హాస్యనటుల సపరేటు ట్రాకుల నుండే వినోదం పుడుతుంది అనుకునే జమానా ఇప్పుడు క్రమంగా మారుతుంది. అలాంటి మార్పుకు ఎప్పుడో శ్రీకారం జరిగినప్పటికీ దాన్ని సిన్సియర్ గా , సీరియస్ గా ఫాలో అవుతున్న దర్శకులు అది కొద్ది మంది మాత్రమే ఉన్నారు. తమ హీరో క్యారెక్టర్ తాలూకు హుందాతనం ఏ మాత్రం తగ్గకుండా గాంభీర్యం నుండే గంపెడంత వినోదాన్ని గుప్పిస్తున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఫస్ట్ లైనర్ గా అభినందించవచ్చు.

దర్శకుడు కాకముందు ఆయన రచన చేసిన స్వయంవరం, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు వంటి చిత్రాలలో హీరో పాత్రలు గంభీర వినోదంతో విశేషంగా అలరించాయి. ఇక దర్శకుడుగా మారిన తరువాత ఆయన సృష్టించిన హీరో పాత్రలు “సూపర్ మ్యాన్” కు తక్కువ- “కామన్ మ్యాన్” కు ఎక్కువ అన్నట్లు సమతుల్యంగా అనిపిస్తాయి. ఆయన హీరో పాత్రల పేర్లు, ప్రవర్తన, వేషం, భాష, బాడీ లాంగ్వేజ్ లలో అతి పోకడలు కనిపించవు.. అలాగని సినిమాటిక్ అప్పీల్ కు అవేగానూ ఉండవు. హీరోయిజమ్ ను సేఫ్ గార్డ్ చేస్తూనే హీరో పాత్రల నుండి వినోదాన్ని తెలివిగా పిండుకునే సున్నిత చమత్కారం త్రివిక్రమ్ సినిమాలలో నిండుగా కనిపిస్తోంది.

ఒక్కసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలోని హీరో పాత్రల పేర్లను వాటి స్వభావ స్వరూపాలను గుర్తు చేసుకుంటే అవి “కొంచెం కామన్ మ్యాన్- కొంచెం సూపర్ మ్యాన్ లక్షణాల కరెక్ట్ బ్లెండింగ్” అని మీరు కూడా అంగీకరిస్తారు.

1) నువ్వే నువ్వే
హీరో – తరుణ్
పాత్ర పేరు – రిషి

2) అతడు
హీరో – మహేష్ బాబు
పాత్ర పేరు – నందగోపాల్ / పార్థు

3) జల్సా 
హీరో – పవన్ కళ్యాణ్
పాత్ర పేరు – సంజయ్ షాహు

4)ఖలేజా 
హీరో – మహేష్ బాబు
పాత్ర పేరు – సీతారామరాజు

5) జులాయి
హీరో – అల్లు అర్జున్
పాత్ర పేరు – రవీంద్ర/రవి నారాయణ్

6) అత్తారింటికి దారేది
హీరో – పవన్ కళ్యాణ్
పాత్ర పేరు -గౌతమ్ నంద / సిద్దు

7) సన్నాఫ్ సత్యమూర్తి
హీరో – అల్లు అర్జున్
పాత్ర పేరు – విరాజ్ ఆనంద్

8)అ ఆ 
హీరో – నితిన్
పాత్ర పేరు – ఆనంద్ విహారి

9) అజ్ఞాతవాసి
హీరో – పవన్ కళ్యాణ్
పాత్ర పేరు – అభిషిక్త / భార్గవ్

10) అరవింద సమేత వీర రాఘవ
హీరో- ఎన్టీఆర్
పాత్ర పేరు – వీర రాఘవ రెడ్డి

పైన పేర్కొన్న ప్రతి పాత్రలోనూ హీరోయిజాన్ని – హాస్య చతురతను చాలా ఆహ్లాదంగా బ్లెండ్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఇప్పుడు ఈ పాత్రలు వాటి తీరుతెన్నుల ప్రస్తావన ఎందుకంటే – అరవింద సమేత వీర రాఘవ లో ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది… అసలు లేదు… మరి సినిమా ఆడుతుందో లేదో అంటూ రిలీజ్ అయిన రోజున కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇలాంటి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలో హాస్యం కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తే అపహాస్యం పాలవటం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అలాగని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సహజసిద్ధమైన వినోద శైలిని ఇందులో మిస్ అయ్యారు అనుకోవటం పొరపాటు.

గంభీరంగా అడవిలో సంచరిస్తున్న సింహం మీదకు ఒక పిల్లిపిల్ల ఎక్కి గంతు లేయటం చూస్తే నవ్వొస్తుంది. ఇక్కడ ఆ నవ్వుకు కారణం పిల్లిపిల్ల మాత్రమే అనుకుంటే పొరపాటు. సింహానికి కూడా ఆ కామెడీ జనరేషన్ లో పాత్ర ఉంది. అలాంటి గంభీరమైన వీర రాఘవ రెడ్డి పాత్ర చుట్టూ పూజా హెగ్డే, సునీల్ , నరేష్, యాక్షన్ బ్యాచ్ లనుండి కావలసిన వినోదాన్ని కావలసిన మేరకు తీసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక్కడ చూడవలసింది రౌద్ర, వీర, భయానక రసాలతో హాస్య, అద్భుత, శాంత రసాలను ఏ పాళ్లలో మిళితం చేశాడు అని.

అంతేతప్ప ప్రత్యేక కామెడీ ట్రాకులు పెట్టనందుకు ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అనుకోవటం కరెక్ట్ కాదు. ఇది కేవలం అరవింద సమేత… లో వీరరాఘవ రెడ్డి పాత్ర విషయంలోనే కాదు… త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించిన హీరో పాత్రలు అన్నింటిలోనూ ఇలాంటి గంభీర హాస్యం సుమ సున్నిత చమత్కారంగా తళ్ళుక్కుమంటుంది.

ఇలా ఎంటర్టైన్మెంట్ అనే పదానికి ఉన్న బ్రాడర్ సెన్స్ ను ఒక వైడ్ యాంగిల్ లో ఆవిష్కరిస్తూ అద్భుత విజయాలను అందుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హృదయ పూర్వక శుభాభినందనలు పలుకుతుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కం”
Hats off to the “Charlie Chapline of writing” Trivikram Srinivas.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here