కొత్త అవతారం లో రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma New Avatar,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Ram Gopal Varma Movie Latest News,Lakshmi's NTR Movie Latest Updates,Ram Gopal Varma on Lakshmi's NTR Movie,RGV New Avatar,Ram Gopal Varma Upcoming Movies,Lakshmi's NTR Movie Details
Ram Gopal Varma New Avatar

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీ రెండు భాగాలుగా ఎన్టీఆర్ కధానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా శరవేగం గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు జనవరి నెలలో రిలీజ్ కానున్నాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రూపొందించి జనవరి లో రిలీజ్ కు ప్లాన్ చేశారు.

పరమ నాస్తికుడైన రామ్ గోపాల్ వర్మ తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకుని నుదిటిన బొట్టు, కండువా, చేతి లో ప్రసాదం తో పరమ భక్తుడిగా ట్విట్టర్ లో ఫోటో షేర్ చేసి తన ఫాలోవర్స్ కు షాక్ తినిపించారు. ఈ రోజు 19వ తేదీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తున్నామని,లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి తాను భక్తుడిగా మారాల్సివచ్చిందని,ఎన్టీఆర్ తనను ఇలా తయారు చేశారని కామెంట్ పెట్టారు. తాను రూపొందించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లక్ష్మి పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండదని, నిజాలు నిరూపించేలా ఉంటుందని, ఈ సినిమా వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశ్యాలు లేవని చెప్పినా నమ్మరు కనుక చెప్పనని రామ్ గోపాల్ వర్మ తెలిపారు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here