పవన్ కళ్యాణ్ పాటకు సంగీతం అందిస్తున్న థమన్

Thaman Music for Pawan Kalyan Song,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Thaman Music for Pawan Kalyan Movies,Thaman Music for Power Star Pawan Kalyan Movie Songs,Music Director Thaman Latest News,Thaman to Compose Music For Pawan Kalyan Films
Thaman Music for Pawan Kalyan Song

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అదేంటీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయట్లేదు కదా.. పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేస్తున్నారు కదా.. మరి పవన్ పాటకు థమన్ సంగీతం అందించడం ఏంటనుకుంటున్నారా..? సినిమాలో కాదులెండి. అసలు సంగతేంటంటే.. పవన్ కళ్యాణ్ ఈ నెల 15 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని రాజ‌మండ్రిలో జ‌న‌సేన కవాతు నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ కవాతులో వేలాది మంది జనసేనకులు పాల్గొననున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కవాతు కోసం ఓ పాటను చేయించారట పవన్ కళ్యాణ్.

ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పదపదపదపద పవనమై పద అనే పల్లవితో సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా… బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ థమన్ ఈ పాటకు సంగీతం అందించాడని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన ఖుషి సినిమాలో ఏ మేర జహ” అనే పాటను గుర్తు చేశారు. ఏ మేర జహ” అనే పాట కంపోజ్ లో తమన్ ప్రముఖ పాత్రను పోషించాడని అప్పుడు తను టీనేజ్ లో ఉన్నాడని తెలిపారు.

 

 

 

కాగా థమన్ రీసెంట్ మ్యూజిక్ అందించిన అరవింద సమేత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ కు మరోసారి మంచి గుర్తింపుదక్కింది. ముఖ్యంగా పెనివిటి సాంగ్ కు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి మార్కుల్ పడ్డాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here