జోరు మీదున్న విజయ్ దేవరకొండ – న్యూ ప్రాజెక్ట్ కు రెడీ

Vijay Deverakonda Gets Ready for New Movie,Vijay Deverakonda Bags Another Prestigious Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2018,Telugu Cinema News,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Upcoming Projects
Vijay Deverakonda Gets Ready for New Movie

విజయ్ దేవరకొండ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ బిజీ బిజీ షెడ్యూల్ లో ఉంటున్నాడు ఎప్పుడూ. ఇటీవలే తాజాగా నోటా సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదలైన ఈ సినిమా కోసం తెలుగు తో పాటు, తమిళ్ లో కూడా తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ బాగానే కష్టపడ్డాడు. ఆ సినిమా అయిపోయిందో లేదో…టాక్సీవాలాతో ఎప్పుడు వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. వీటితో పాటు డియర్ కామ్రేడ్ సినిమా కూడా చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో సినిమా సినిమాకు రెడీ అయ్యాడు విజయ్. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 18 న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ ఉంగరాల రాంబాబు వంటి చిత్రాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మిస్తోన్న 46వ చిత్రమిది. అయితే ఇప్పటి వరకూ ఒక్క హీరోయిన్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్న విజయ్ ఇప్పుడు ముగ్గురు భామలతో నటించనున్నాడు. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోన్న ఇజబెల్లె హీరోయిన్లుగా నటించనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here