రానున్న మూడు నెలల వరకు ఖరారైన రిలీజ్ లు

Latest Telugu Movies 2018, Latest Telugu Movies Releasing Dates, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Movies Releasing in the Next 3 Months, Tollywood Cinema Latest News, Tollywood Movies Releasing in the Next 3 Months, Tollywood Upcoming Movies Updates, Upcoming Telugu Movies Releasing in the Next 3 Months
Telugu Movies Releasing in the Next 3 Months

నిర్మాణం పంపిణీ ప్రదర్శన రంగాలలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఒక సినిమా రిలీజ్ డేట్ ను ముందుగా ప్రకటించాలి అంటే ఎంతో పకడ్బందీ ప్లానింగ్ కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయటం కంటే రిలీజ్ చేయటమే అసలు సిసలు సవాలు అంటున్నారు సినీ విశ్లేషకులు. అయినప్పటికీ తీసే వాళ్ళు తీసుకున్నారు… పంపిణీ చేసే వాళ్ళు చేస్తున్నారు.. ప్రదర్శించే వాళ్లు ప్రదర్శిస్తున్నారు… కానీ చూడాల్సిన జనమే ‘చూద్దాంలే’ అన్నట్టు చూస్తున్నారు. అయితే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ సినిమా అనే సమ్మోహనశక్తి నిర్మాతలను తన వైపు ఆకర్షిస్తూనే ఉంది. ఇండస్ట్రీ పట్ల, చిత్ర నిర్మాణం పట్ల ఏమాత్రం అవగాహన ఇక పోయినప్పటికీ కోట్లాది రూపాయల కష్టార్జితాన్ని తెచ్చి సినీ వ్యామోహ జూద వ్యసన క్రీడలో “ఆల్ కౌంట్” ఆడుతున్నారు ఔత్సాహిక నిర్మాతలు. అందుకే సాలీనా అవుతున్న చిత్రాల సంఖ్య ఏ ఏటికి ఆ యేడు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల కాలంలో రిలీజ్ కు డేట్స్ ప్రకటించుకున్న నిర్మాతల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఈ డేట్స్ ను  కొందరు నిర్మాతలు అధికారికంగా కొందరు అనధికారికంగా చెప్పుకుంటున్నారు. ఇంక కు అక్టోబర్ 11 నుండి 2019 జనవరి మాసాంతం వరకు డేట్స్ ప్రకటించబడిన చిత్రాలు ఏవో చూద్దాం.

కుటుంబపరంగా ఒక అనూహ్య విషాదం ఎదురైనప్పటికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ మాత్రం చలించకుండా సహకరించడంతో  ” అరవింద సమేత వీర రాఘవ” అనుకున్నట్టుగానే అక్టోబర్ 11న విడుదలై విజయ పథంలో దూసుకుపోతోంది… కాగా

అక్టోబర్ – 12న
– – – – – – – – – – – – –
మూడు పువ్వులు- ఆరు కాయలు
బేవర్స్ చిత్రాలు విడుదలయ్యాయి.. ఇక
అక్టోబర్ -18న:
– – – – – – – – – – – –

హలో గురూ ప్రేమ కోసమే పందెంకోడి-2
టూ ఫ్రెండ్స్
అక్టోబర్- 19న
తాంత్రిక

అక్టోబర్ -26న:
– – – – – – – – – – – –
వీర భోగ వసంత రాయలు,
ఆపరేషన్ – 2019,
అదిగో

నవంబర్ -2:
– – – – – – – – – – –
సవ్యసాచి,
బ్లఫ్ మాస్టర్,
శుభాకాంక్షలు

నవంబర్ – 7
——————

సర్కార్,
సువర్ణ సుందరి
నవంబర్ 8న
ముద్ర,
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్

నవంబర్ 14న
———————
కొబ్బరి మట్ట,
కే. జీ.ఎఫ్.

నవంబర్-21
—————–
నవంబర్ 21న వస్తున్నట్లుగా ప్రస్తుతానికి ఏ నిర్మాత ప్రకటించకపోయినప్పటికీ ఏవో కొన్ని చిత్రాలు ప్లాన్ అవుతున్నాయి.

నవంబర్ – 29
——————-
శంకర్ – రజనీకాంత్ ల మోస్ట్ క్రేజీ అండ్ కాస్ట్లీ ఫిలిం 2.0

డిసెంబర్ – 7
——————
ఘంటసాల ద గ్రేట్

డిసెంబర్ – 14
———————
అమర్ అక్బర్ ఆంథోనీ

డిసెంబర్ -21

అంతరిక్షం
యాత్ర
పడి పడి లేచే మనసు
కాంచన త్రీ
మిస్టర్ మజ్ను

2019 జనవరి -9
————————-
ఎన్టీఆర్ – కథానాయకుడు
జనవరి – 12
ఎఫ్ – 2 టు

జనవరి – 24
——————
ఎన్టీఆర్ – మహా నాయకుడు

“మహర్షి ” చిత్రాన్ని  ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు చెప్పారు.. నిర్మాణంలో ఉన్న పెద్ద చిత్రాలు  సైరా, వినయ విధేయ రామా,
తో పాటు మరికొన్ని చిన్న చిత్రాల డేట్స్ ఎనౌన్స్ కావలసి ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here